‘పీఏలు చాలా హాట్, తల దించుకుంటున్నా’: గడ్కరీ
పుణె: మంత్రుల వద్ద పనిచేసే కొందరు వ్యక్తిగత సహాయకులు (పీఏలు) అత్యుత్సాహంతో ఉంటారని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. అంతేగాక, ఛాయ్(టీ) కంటే దానిని మరిగించిన పాత్రే వేడిగా ఉంటుందనీ.. పీఏలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇటీవల రైల్లో నాగ్‌పూర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ మేనేజర్‌కు తన పీఏ ఫోన్ చేసి.. రైలును మొదటి ప్లాట్‌ఫాంకి తీసుకోవాలంటూ తనకు తెలియకుండానే కోరారని గుర్తు చేసుకున్నారు నితిన్ గడ్కరీ. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏకనాథ్ ఖడ్సే తన పీఏ అవినీతికి పాల్పడిన కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

మంత్రులు ఎప్పుడైనా మాజీలు కావచ్చనీ, వారికోసం పోలీసులు అత్యుత్సాహంగా ట్రాఫిక్కును నిలుపు చేస్తుండడం ఇబ్బందికరమనీ కేంద్రమంత్రి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజల ఛీత్కారాలు చూడలేక తాను వాహనంలోనే తలదించుకుంటుంటానని చెప్పారు.
ఆదివారం ముగిసిన మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో గడ్కరీ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు జాతీయ భావంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.












Click it and Unblock the Notifications