షాక్: విమానాన్నే ఛేజ్ చేసి ఎక్కేశాడు(వీడియో)

లండన్‌: సాధారణంగా మనం బస్సు కొద్దిలో మిస్ అయితే పరుగెత్తుకెళ్లి ఎక్కేస్తాం. అదీ కుదరకపోతే ఆటో లేదా బైక్ సాయంతో ఛేజ్ చేసి బస్సును అందుకుంటాం. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా భద్రతా నియమాలను ఉల్లంఘించి మరీ విమానాన్నే ఛేజ్ చేసి ఎక్కేశాడు.

ఆ వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌కు చెందిన సదరు వ్యక్తి మాడ్రిడ్‌ నుంచి గ్రాన్‌ కెనారియా వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ర్యాన్‌ఎయిర్‌ విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే అతడు మాడ్రిడ్‌ ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా చేరుకోవడంతో బోర్డింగ్‌ సమయం దాటిపోయింది.

Man chases flight across tarmac at Madrid airport

విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండటంతో ఎలాగైనా దాన్ని క్యాచ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడతడు. అందుకోసం సెక్యూరిటీ నియమాలను కూడా ఉల్లంఘించాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి దూకి రన్‌వే వైపు పరిగెత్తాడు. ఛేజ్‌ చేసి విమాన సిబ్బందితో మాట్లాడు విమానం ఎక్కేశాడు.

అయితే, విమానం కెనారియా చేరుకోగానే పోలీసులు అతడిని అరెస్టు చేసి, విచారించారు. ఉగ్రవాద సంబంధాలు లేవని తేలడంతో విడుదల చేశారు. కానీ, భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతడికి శిక్ష విధించనున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 5న జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+