దేశాలు తిరిగి.. సెక్స్ సరదాలకే రూ.10 కోట్లు ఖర్చు
బెంగళూరు: ఓ వ్యక్తి సెక్స్ సరదాల కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టిన సంఘటన వెలుగు చూసింది. బెంగళూరులోని విజయపురంలోని ఓ బ్యాంకులో పని చేసిన విజయసారథి అనే వ్యక్తి కేవలం సెక్స్ సరదాలు తీర్చుకునేందుకు ఏకంగా పది కోట్లు ఖర్చు చేసినట్లు సీఐడీ పోలీసుల విచారణలో బయటపడింది.
2012లో ఓ బ్యాంకులో పని చేస్తున్నపుడు ఏకంగా వంద కోట్లను వివిధ రూపాలలో కాజేశారు. ఉన్నతాధికారులు గుర్తించేసరికి పరారయ్యాడు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. సుమారు నాలుగేళ్ళపాటు గాలింపు అనంతరం ఎట్టకేలకు నేపాల్ సరిహద్దులో విజయసారథి ఆచూకీని గుర్తించారు.
అతనిని పోలీసులు అరెస్టు చేశారు. వంద కోట్లు ఏం చేశారనే కోణంలో విచారించిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. విజయపురలో ఓ ఇంటితో పాటు బెంగళూరులోని జేపీ నగర్‌లోను ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను, దక్షిణ కన్నడ జిల్లాలో ఆరెకరాల భూమిని విజయసారథి కొన్నాడు.

దేశవిదేశాలకు చెందిన యువతులతో సెక్స్ సరదాలు తీర్చుకునేందుకు రూ.పది కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు తేలింది. ముంబై, పూణే, ఢిల్లీలతో పాటు అరబ్ దేశాలు, యూరోపియన దేశాలలో తిరిగి జల్సా చేసినట్లు పోలీసులకు తెలిపారు.
ప్రతిచోటా 5, 7 స్టార్ హోటల్స్‌లో గడిపినట్లు ఒక్కో రాత్రికి రూ.5లక్షలు ఖర్చు చేసేవాడు. టిప్ కూడా భారీగానే ఇచ్చేవాడని తేలింది.
గతంలోనే వివాహం చేసుకున్న భార్యను వదిలేసిన విజయసారథికి రేణుకా అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని, ఆమె పేరిట పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. సీఐడీ పోలీసులు మరింత వివరాల కోసం నిందితుడ్ని విచారిస్తున్నారు. దోచుకున్న డబ్బుతో సెక్స్ సరదాలు తీర్చుకోవడంతో పాటు అతను మంచి జీవితం అనుభవించాడు. మంచి మంచి కార్లలో తిరిగాడు.












Click it and Unblock the Notifications