షాక్: వధువుతో ఐటెం సాంగ్! పెళ్లి రద్దు
అగ్రా: ఐటమ్ సాంగ్‌కు డాన్స్ చేయమని బలవంతపెట్టినందుకు ఓ పెళ్ళికూతురు ఏకంగా తన పెళ్ళినే రద్దు చేసుకుంది. ఈ ఘటన ఆగ్రాలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్ళి జోరు మీద సాగుతుండగా.. పెళ్ళికొడుకు స్నేహితులు వధూవరుల్ని ఒక బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ చేయమని పిలిచారు. అందుకు తన వల్ల కాదని, పెళ్లి కూతురు అంగీకరించలేదు.

దీంతో ఒక్కడే డాన్స్ చేసిన పెళ్ళికొడుకు తర్వాత ఆమెను మళ్ళీ పిలిచాడు. ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతపెట్టాడు. అవమానం పట్టలేక ఆ అమ్మాయి దండలు విసిరి పారేసి వెళ్ళిపోయింది.
ఆమె తండ్రి కూడా ధైర్యంగా కూతురి పక్షాన్నే నిలిచి మగపెళ్ళివారిని వెళ్ళిపొమ్మన్నాడు. దీంతో పెళ్లి రద్దయిపోయింది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు.. గొడవ చేయబోయిన పెళ్ళికొడుకు సహా ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications