శునకంతో బాలుడికి పెళ్లి చేశారు (ఫోటోలు)
న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల గురించి ప్రభుత్వాలు ప్రజల్లో ఎంత చైతన్యం కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బాలుడికి శునకంతో పెళ్లి చేసిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని సరైకేలా ఖర్సావన్ ప్రాంతంలో దుష్ట శక్తులు వదిలిపోతాయన్న నెపంతో ఓ బాలుడికి శునకంతో పెళ్లి చేశారు.
ముఖేష్ అనే బాలుడికి నోటి పైవరుసలో ఒక దంతం వచ్చింది. ఈ విధంగా దంతం రావడం శుభసూచకం కాదని భావించిన బాలుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని జరిపించారు. శునకాన్ని వధువులా తయారు చేసి ముఖేశ్‌తో దానికి పెళ్లి చేశారు.
ఈ విధంగా చేయడం వల్ల దుష్టశక్తులు బాలుడి దరి చేరవన్నది వారి నమ్మకం. ఈ తరహా పెళ్లిళ్లను ప్రతి ఏడాది అక్కడ జనవరి 15 నుంచి 21 తేదీల్లోపు నిర్వహిస్తుంటారని తెలిపారు. అయితే శునకాన్ని పెళ్లికూతురు లాగే అందంగా అలంకరించి పెళ్లి చేయడం విశేషం.

శునకంతో బాలుడికి పెళ్లి చేశారు
మూఢ నమ్మకాల గురించి ప్రభుత్వాలు ప్రజల్లో ఎంత చైతన్యం కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బాలుడికి శునకంతో పెళ్లి చేసిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.

శునకంతో బాలుడికి పెళ్లి చేశారు
వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని సరైకేలా ఖర్సావన్ ప్రాంతంలో దుష్ట శక్తులు వదిలిపోతాయన్న నెపంతో ఓ బాలుడికి శునకంతో పెళ్లి చేశారు. ముఖేష్ అనే బాలుడికి నోటి పైవరుసలో ఒక దంతం వచ్చింది. ఈ విధంగా దంతం రావడం శుభసూచకం కాదని భావించిన బాలుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని జరిపించారు.

శునకంతో బాలుడికి పెళ్లి చేశారు
శునకాన్ని వధువులా తయారు చేసి ముఖేశ్‌తో దానికి పెళ్లి చేశారు. ఈ విధంగా చేయడం వల్ల దుష్టశక్తులు బాలుడి దరి చేరవన్నది వారి నమ్మకం.

శునకంతో బాలుడికి పెళ్లి చేశారు
ఈ తరహా పెళ్లిళ్లను ప్రతి ఏడాది అక్కడ జనవరి 15 నుంచి 21 తేదీల్లోపు నిర్వహిస్తుంటారని తెలిపారు. అయితే శునకాన్ని పెళ్లికూతురు లాగే అందంగా అలంకరించి పెళ్లి చేయడం విశేషం.












Click it and Unblock the Notifications