ఆంధ్రప్రదేశ్‌లోను తెరాస, మంచిదేగా: కవిత ఆసక్తికరం
హైదరాబాద్: భవిష్యత్తులో ఏపీలోను నటకాచ విస్తరించి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు వస్తే మంచిదేగా అని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆమె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తల సంఖ్య పెరుగుతుంటే ఏ ప్రాంతంలోనైనా తెరాస బలపడుతుందన్నారు. ఇటీవలి కాలంలో మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు ఆంధ్రా ప్రాంత ప్రజలకు సానుకూలంగా మాట్లాడుతున్నారు.
కవిత ఇటీవలి ఏపీ పర్యటనలను ప్రస్తావిస్తూ... భవిష్యత్తులో ఆంధ్రా ప్రాంతంలో తెరాస ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉందా? అన్న ప్రశ్నించగా... అలా జరిగితే బాగుంటుంది కదా అన్నారు. అల్టిమేట్‌గా కార్యకర్తలు బాగుపడతారన్నారు. పార్టీ బాగుపడుతుందన్నారు.

రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య మతపరంగా బీజేపీ తగాదాలు సృష్టిస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత శనివారం నాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం సారంగాపూర్‌లో దళిత భూపంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేయడం సరికాదని, ఇప్పటికే తెరాస కార్యాలయంలో 15 ఏళ్లుగా విలీనం వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
విమోచన దినోత్సవాన్ని జరపాలని తెలంగాణ ప్రజలు అడగకపోవడం వల్ల చర్యలు తీసుకోలేదన్నారు. కొన్నేళ్లుగా డిమాండ్‌లో ఉన్న జగిత్యాలను జిల్లా చేశామని, ఎక్కడో మూలకు ఉన్న ప్రాంతమైన గద్వాలను జిల్లా చేయాలని డీకె అరుణ కోరడం అర్థరహితమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ జిల్లా చేయాలో ప్రభుత్వానికి తెలుసని, నిరాహార దీక్షలు మాని గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. ఆమె మనకో బొమ్మాళి అన్నారు.












Click it and Unblock the Notifications