భార్య ఐనా తల్లి ఐనా ఒకటే, నా చెల్లి ఏడుగుర్ని పెళ్లాడింది: ఐసిస్ తీవ్రవాది
వాషింగ్టన్: షరియత్ చట్టాల ప్రకారం తల్లి అయినా, సోదరి అయినా, భార్య అయినా లైంగిక బానిసలుగా ఉండాల్సిందేనని ఓ ఐసిస్ టెర్రరిస్ట్ చెప్పాడు. ఐసిస్ ఉగ్రవాదులు ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తారో తెలిసిందే. యువతులను లైంగిక బానిసలుగా చూస్తారు.
ఐసిస్ ఉగ్రవాదిగా ఉంటూ స్లీపర్ సెల్స్‌ను నియమించేందుకు వెళ్లిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు నాలుగు నెలల క్రితం అరెస్టు చేశాయి. ఇటీవల చేసిన ఇంటర్వ్యూ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. దీనిలో మహిళలను వారెలా చూసేది, ఎంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించేదీ అతని మాటల్లోనే చెప్పింది.
కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, తోడ బుట్టిన చెల్లెలైనా, ఇస్లామిక్ చట్టం మాత్రమే వర్తిస్తుందని, లైంగిక బానిసలుగా ఉండాల్సిందేనని చెప్పాడు. తన భార్య ఎప్పుడూ బురఖా ధరించే ఉంటుందని చెప్పాడు. తాను లేకుండా బయటకు వెళ్లడం నిషేధమన్నాడు.

తాను అరెస్ట్ అయి నాలుగు నెలలు దాటిన కారణంగా ఆమెను ఇంకెవరైనా వివాహం చేసుకోవచ్చునని, ఆమె ఉన్నదే పిల్లలను కనడానికి అని చెప్పాడు. జిహాద్ ప్రపంచంలో మహిళకు స్వీయ ఇష్టాలు ఉండవన్నాడు. వారు ప్రాణాలతో మాత్రమే ఉంటారని, నచ్చినట్టు ఉండే అవకాశం లేదన్నాడు.
మీరు బానిసలుగా చూస్తున్న మహిళలల్లో మీ తల్లి లేదా చెల్లి ఉంటే? వారిని సంతల్లో పశువుల్లా అమ్మితే? నీ దగ్గరి స్నేహితుడే నీ భార్యను పెళ్లాడితే? వంటి ప్రశ్నలు అడిగితే సభ్య సమాజం విస్తుపోయే సమాధానం అతని నోటి వెంట వచ్చింది.
సామాజిక న్యాయ వ్యవస్థ లేని షరియత్ పాలనలో, తల్లయినా, చెల్లయినా ఒకటేనని, తాను అటువంటివి పట్టించుకోనన్నారు. ఆడవాళ్లంతా దిగువ స్థాయి వారేనన్నాడు. జీహాద్ ప్రపంచంలో యాజ్దీ మహిళలు విలువైన లైంగిక బానిసలని, వారంతా ఐసిస్ పెద్దల కోసమే పుట్టారన్నాడు. వారిని ఎలా కావాలంటే అలా వాడుకుంటామన్నాడు. తన సోదరికి ఇప్పుడు 16 ఏళ్ల వయస్సు అని చెప్పాడు. ఆమె ఇప్పటికి ఏడుగురిని పెళ్లాడిందని తెలిపాడు. ఆమె ఇప్పటికి సిరియాలోనే ఉందని చెప్పాడు.












Click it and Unblock the Notifications