తెలంగాణలో టీడీపీ ఖాళీ: నేతల సెంటిమెంట్ ఇదే?
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలవుతూ వచ్చింది. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వరుస కష్టాలకు 'టీటీడీపీ' అనే పదమే కారణమని మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అంతేకాదు తెలంగాణలో గతంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను సైతం వీటికి ఉదహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ, టీటీడీపీ అని సంబోధిస్తే పార్టీకి కష్టాలు తప్పవని కొందరు పండితులు చెబుతున్నారు. పండితులు కూడా టీడీపీ ముందు తెలంగాణ పదం చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సూచిస్తున్నారు.
దీనిపై వన్ఇండియా తెలుగు జ్యోతిష్యులు కూడా ఇదే విధంగా స్పందించారు. టీడీపీ ముందు తెలంగాణ అనే పదం చేర్చడం వల్లనే తెలంగాణలో పార్టీ అడ్రస్ లేకుండా పోయిందంటున్నారు. వాస్తవ రాశి చక్ర ప్రకారం చూస్తే కొన్ని పదాల ముందు తెలంగాణ పదం చేర్చడం ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు.

ఆ కోవలోకే టీడీపీ ముందు తెలంగాణ పదం చేర్చడం లాంటిదంటున్నారు. గతంలో ఇలాగే టీడీపీ పేరుకు ముందు పదాలను చేర్చడం వల్లే అన్నతెలుగుదేశం, ఎన్టీఆర్‌టీడీపీలు పతనమయ్యాయని విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి ఇకపై తెలంగాణ టీడీపీ కాకుండా తెలుదేశం తెలంగాణ పార్టీ అని పిలిస్తే బాగుంటుందని పలువురు పండితులు సూచించారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా ఏపీటీడీపీ అని కాకుండా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ పార్టీ అని పిలిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దీంతో ఈ క్రమంలో మీడియాలోనూ ఇకపై తెలంగాణ టీడీపీ అని కాకుండా తెలుగుదేశం తెలంగాణ పార్టీ అని రాసేలా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతేకాదు నేతలను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇకపై టీటీడీపీ అని రాయవద్దని కోరుతున్నారట. తమ హోదాలను రాసేటప్పుడు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే సెంటిమెంట్‌ను కాంగ్రెస్ పార్టీకి అన్వయిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ధ్వంసమైపోవడానికి ఇదే సెంటిమెంట్ కారణమని పండితులుు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications