బావ చంద్రబాబు కోసం బాలకృష్ణ యాగం?
విజయవాడ: బావ నారా చంద్రబాబు నాయుడి కోసం హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక యాగం, హోమం చేయాలని నిర్ణయించుకున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కోసం ఆ యాగాన్ని ఆయన తలపెట్టినట్లు సమాచారం.
అందుకు గాను బాలకృష్ణ జ్యోతిష్కులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత గ్రహాలను బట్టి చూస్తే పాలకులకు ఇప్పటి దశ మంచిది కాదని జ్యోతిష్కులు ఆయనతో చెప్పారట. గ్రహాల కదలికల కారణంగా అమరావతి నిర్మాణంలో జాప్యం జరగవచ్చునని వారన్నట్లు తెలుస్తోంది.

జోతిష్యంపై విశ్వాసం గల బాలకృష్ణ ప్రత్యేక హోమాలు చేయడానికి ప్రముఖ పండితులను సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా ఆ యాగాలు చేయాలని ఆయన అనుకుంటున్నారు
ప్రభుత్వ ఆగమ సహాలదారుడు, కాంచీపీఠం ఆస్థాన జ్యోతిష్కుడు ఎల్. సుబ్రహ్మణ్య సిద్ధాంత గ్రహ కదలికలు పాలకులకు మంచివి కావని చెప్పినట్లు సమాచారం. ఆటంకాలను అధిగమించడానికి రాజా శ్యామల సంపుతిత పాశుపత మాహాయాగం చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications