'గంగా' ఎఫెక్ట్, పిల్లనివ్వం: ఆ యువకులకు చేదు
బిజ్నోర్: గంగానది కారణంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో 25 నదీ ప్రవాహ ప్రాంతాల్లోని యువకులకు పెళ్లి ఇబ్బందిగా మారింది. ఈ గ్రామాలలోని యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం కంటే అమ్మాయిలను తమ ఇళ్లలో పెళ్లి చేయకుండా ఉంచడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు.
దీంతో బిజ్నోర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. తమ కూతుళ్లను ఈ 25 గ్రామాల్లోని యువకులకు ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి మిగతా గ్రామాల్లోని తల్లిదండ్రులకు ఓ కారణం ఉంది. అదీ గంగానది.
గంగానదిని ఈ 25 గ్రామాలున్నాయి. ఆ గ్రామాలకు గంగానది నుంచి సరైన రక్షణ లేదా గట్టు లేకపోవడంతో వరదల సమయంలో తరచూ ఈ గ్రామాలు మునిగిపోతుంటాయి. దీంతో పంటలు నాశనమవుతున్నాయి. సారవంతమైన పంట భూములు కోతకు గురవుతున్నాయి.

దీంతో వరద బాధిత గ్రామాలకు పిల్లను ఇచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి బిజ్నోర్ జిల్లాలో ప్రవహించే గంగానదితో ఇటీవలి వరకు నదీ పరివాహక గ్రామాలు సుభిక్షంగా ఉండేవి. అందరూ సుఖసంతోషాలతో ఉండేవారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం గంగానదికి వరదలు. వరదలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నది ఉగ్రరూపానికి పచ్చని పంట పొలాల్లోని సారవంతమైన నేల కోతకు గురవుతోంది. పంటలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి.
వర్షాకాలంలో గ్రామస్తుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఇళ్లు, పంట పొలాలను నది ముంచుతోంది. ఫలితంగా గ్రామస్తులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో, బిజ్నోర్‌లోని ఈ గ్రామాల యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications