'పాక్ వర్సిటీలో ఉగ్రదాడి వెనుక భారత్, పారికర్ కుట్ర'
లాహోర్: పాకిస్తాన్ వాయువ్య ప్రాంతమైన చర్సద్దా నగరంలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదుల దాడి వెనుక భారత్ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉన్నారంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ అర్థరహితమైన ఆరోపణలు చేశాడు.
బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం జరిగిన ఉగ్రవాద దాడికి తామే కారణమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ ప్రకటించింది. అయితే, పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ మాత్రం సంచలన ప్రకటన చేయడం గమనార్హం. దాడి వెనుక భారత్ హస్తముందని ఆయన ప్రకటించాడు.
అంతేకాదు, దాడి వెనుక భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర దాగుందని వ్యాఖ్యానించాడు. తాలిబాన్లతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న భారత్ ఈ దాడికి పథక రచన చేసిందని ఆరోపించాడు. మనోహర్ పారికర్ కనుసన్నల్లో నడుస్తున్న భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఈ దాడికి రూపకల్పన చేసిందని మాలిక్ వ్యాఖ్యానించాడు.

ఇదే సమయంలో పంజాబ్‌లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని సైతం ప్రస్తావించాడు. పఠాన్ కోట్ దాడిలో జైషే మొహ్మద్ పాత్ర లేదని, భారతీయులే ఆ తరహా దాడులకు పాల్పడుతున్నారని, భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు మెరుగవడం 'రా'కు ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు.
ఎప్పుడైతే చర్చలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందడుగు వేశారో, దానిని నిలువరించేందుకు 'రా'అధికారులు ఈ దాడులకు తెర తీశారని వ్యాఖ్యానించాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పారికర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకికర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఆ తరహా ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పారికర్‌కు ఎంత ధైర్యమంటూ ఊగిపోయాడు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications