పని మనిషితో భర్త రాసలీలలు: గుట్టు విప్పిన చిలుక

కువైట్: మాటలు నేర్చిన చిలుక ఎంత పనిచేసుందో తెలుసుకుంటే ముక్కున వేలేసుకోక తప్పదు. తాను నేర్చిన మాటలతో ఓ రామచిలుక తన ఇంటి యజమాని గుట్టు విప్పి అతని భార్యకు అసలు విషయం చెప్పేసింది. పని మనిషితో రహస్యంగా శృంగారలీలలు జరుపుతూ ఆమెతో ఆ వ్యక్తి పలికిన మాటలను చిలుక అతని భార్య వద్ద పలికింది.

దాంతో పనిమనిషితో అతను జరుపుతున్న రాసలీలలు గుట్టు రట్టయింది. ఫలితంగా అతను జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన కువైట్‌లో జరిగింది. పనిమనిషితో జరుపుతున్న రాసలీలల గురించి పెంపుడు చిలుక చెప్పేయడంతో భార్య అతనిపై కేసు పెట్టింది.

Parrot Reveals

వారిద్దరు రహస్యంగా మాట్లాడుకున్న మాటలను చిలుక పదే పదే వల్లె వేస్తూ వచ్చిందని, వారిపై అనుమానం కలిగిందని హవాల్లి పోలీసులు స్టేషన్‌లో చేసిన మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. తన భర్త తనను మోసం చేస్తున్నాడనే అనుమానం తనకు చాలా కాలంగా ఉంనది, చిలుక మాటలతో ఈ అనుమానం నిజమైందని ఆమె చెప్పిదంి.

అయితే, చిలుక చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదు చేయలేమని పోలీసులు తేల్చేశారు. టీవీలో రాసలీలల దృశ్యాలు చూసి ఆ మాటలను చిలుక వల్లె వేస్తూ ఉండవచ్చునని, చిలుక మాటల ఆధారంగా నేరాన్ని రుజువు చేయడం కష్టమని పోలీసులు అంటున్నట్లు అరబ్ టైమ్స్ పత్రిక రాసింది. గల్ఫ్ దేశాల్లో అక్రమ సంబంధం కలిగి ఉండడం నేరం. ఇది రుజువైతే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+