పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల గొడవ: టిడిపితో ఫ్యాన్స్ ఢీ
ఏలూరు: సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఆయన అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య చిచ్చు పెట్టాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఆయన అబిమానులు ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేశారు.
టిడిపి నేతలే వాటిని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే, టిడిపి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నించారు.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే, రోడ్డుకు అడ్డం వస్తుందనే కారణంతో ఫ్లెక్సీలను టిడిపి నేత ఒకరు తొలగించారని అంటున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చిరిగి పోయి ఉండడాన్ని గమనించారు.
దాంతో అక్కడే వారు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా కింద పడేసి తొక్కిన టిడిపి నేతలను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications