సర్దార్: పవన్ కళ్యాణ్‌కు ఆ 'ప్రకటన' కలిసి వచ్చిందట!

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వద్ద డబ్బులు లేవన్న ప్రకటన ఆయనకు మరో ఫలితాన్ని కూడా ఇచ్చిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు ఆశించిన స్పందన లేదు.

సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్‌‍కు ఉన్న అభిమాన గణం, ఆయన ఇమేజ్ కారణంగా మంచివసూళ్లే సాధించింది. దాదాపు రూ.50 కోట్ల షేర్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అది కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంగానే అని చెప్పవచ్చు.

ఈ సినిమా రూ.వంద కోట్లు వసూలు చేస్తుందని భావించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆ మేర వసూళ్లు చేసే అవకాశం లేదని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

Pawan Kalyan's poverty statement affect!

అదే సమయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ... తన వద్ద డబ్బుల్లేవని, కనీసం ఇంట్లోని పని వాళ్లకు కూడా వేతనాలు ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ వంటి అంత పెద్ద స్టార్ అలాంటి వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి ఆశించిన మేర కలెక్షన్లు వచ్చే అవకాశం లేనందున, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పనికి వచ్చేలా ఉన్నాయని, ఇప్పటికే తాను పనివాళ్లకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో లేనని, తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడం ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను రీపేమెంట్ కోసం అడగలేని పరిస్థితి కనిపించారని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+