ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన పవన్ కల్యాణ్?

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారా? అవునని అంటున్నారు బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ బిజెపిపై కారాలు మిరియాలు నూరిన నేపథ్యంలో బిజెపి నేతలు ఆయనపై శివమెత్తుతున్నారు.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రాప్రజల చేతుల్లో పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కావాలన్ని కోరికతోనే ప్రజలను పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Pawan Kalyan Wants to become CM of AP?

ఎంతఎదిగినా ఒదిగి ఉండాలన్ని దానికి పవన్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, జనసేన ఎన్డీయేలో ఎప్పుడు చేరిందో, ఎప్పుడు వైదొలగిందో పవనే చెప్పాలని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలకు పవన్‌కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని సిద్ధార్థనాథ్ డిమాండ్‌ చేశారు.

జనసేనను ముందు రాజకీయ పార్టీగా మార్చుకోవాలని సిద్ధార్థనాథ్ సింగ్ పవన్ కల్యాణ్‌కు సూచించారు. ప్యాకేజీపై పవన్ సహా ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ధైర్యముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. పవన్ కల్యాణ్‌కు పరిపాలనా అనుభవం లేదన్నారు. రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే వెంకయ్యపై విమర్శలు సరికావన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+