మాస్: స్టేప్పులేసిన నారాయణ (పిక్చర్స్)
హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలకు మాస్ అపీల్‌ను అద్దడంలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ముందు వరుసలో ఉంటారు. ఆయన డైలాగులు కూడా మాస్ అపీల్‌తో ఉంటాయి. తాజాగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు.
నూతన సంవత్సరం వేడుకల్లో పాటలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. నూతన సంవత్సరం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో హుస్సేనసాగర్ బోట్‌లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ఆనందంతో చిందులు వేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గ1న్నారు. సినీగీతాలకు స్టెప్పులు వేస్తూ నారాయణ అందరినీ అలరించారు. చాడ వెంకటరెడ్డి నారాయణ డ్యాన్స్‌కు నవ్వుతూ కనిపించారు.

ఇలా కేక్ కట్ చేశారు..
సిపిఐ ఆద్వర్యంలో హుస్సేన్ సాగర్‌లోని ఖైరున్నీసా బోట్‌లో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ కేక్ కట్ చేశారు.

ఇలా సెల్ఫీ కూడా...
సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఇలా సెల్ఫీ తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు.

స్టెప్పులేశారు...
సినిమా గీతాలకు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ స్టెప్పులేస్తూ అందరినీ ఉల్లాసపరుస్తూ ఇలా కనిపించారు.

ఇతర నాయకులతో కలిసి...
సుధాకర్, లెల్వయ్య వంటి నాయకులతో నారాయణ సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తూ ఇలా కనిపించారు. చాడ వెంకట రెడ్డి నవ్వుతూ కనిపించారు.

ఇలా కార్యక్రమాలు...
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సిపిఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలికలు తమ కళాప్రదర్శనకు పదును పెట్టారు.












Click it and Unblock the Notifications