అంబరీష్‌కు కౌంటర్‌గా తెరపైకి రమ్య, మరిన్ని చిక్కులే!
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల కేబినెట్ నుంచి 14 మందిని తొలగించి, 13 మంది కొత్త వారిని తీసుకున్నారు. పద్నాలుగో మంత్రిని తీసుకోవాల్సి ఉంది. దీనికి నటి, మాజీ ఎంపీ రమ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
అయితే, సిద్ధరామయ్య ఎవరిని తీసుకుంటారనే విషయమై ఆయన మనసులో ఏముందో తెలియడం లేదని అంటున్నారు. రమ్యను కేబినెట్లోకి తీసుకుంటారనే వార్తల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ.. ఇవి కేవలం పుకార్లేనని చెప్పారు. ఖాళీ అయిన 14వ కేబినెట్ స్థానంలో, తొలగించిన వారిలో ఒకరిని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
ఒక్కసారిగా పద్నాలుగు మందిని తొలగించడంతో ఇప్పటికే సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు రమ్యను తీసుకుంటే మరో సమస్య అవుతుందని, కాబట్టి తొలగించిన వారిలోనే ఒకరిని తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రమ్య వర్సెస్ అంబరీష్

ఇటీవల మంత్రి పదవి నుంచి తొలగించిన వారిలో అంబరీష్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పటికే అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో రమ్య వర్సెస్ అంబరీష్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రమ్యను తీసుకుంటే మరింత చిక్కులు వస్తాయని అంటున్నారు.
ఇరువురు కూడా వొక్కలింగ కమ్యూనిటీకి చెందినవారు. మాండ్యాలో అంబరీష్ పాపులర్ వ్యక్తి. అంతేకాదు, అక్కడ రమ్యకు కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆమె అంబరీష్ కారణంగానే ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి.
అంతేకాకుండా, రమ్యను కేబినెట్లోకి తీసుకుంటే ఆమెను మండలికి పంపించవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది క్లిష్టమనదే అంటున్నారు. అంబరీష్‌కు వ్యతిరేకంగా రమ్యను తెరపైకి తీసుకు రావచ్చునని కొందరు అంటుంటే, అలాంటి సమీకరణమే ఓ ఫూలిష్ అని మరికొందరు అంటున్నారు.
ఇప్పటికే అంబరీష్‌ను మంత్రివర్గం నుంచి తప్పింటిన నేపథ్యంలో, విపక్షాలు వొక్కలింగ ఓట్లను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రమ్యనే అసలైన ఆప్షన్ అనే వారు కూడా లేకపోలేదు. ఆమె ద్వారా నష్టం పూడ్చుకోవచ్చునని అంటున్నారు.
రమ్యను తీసుకోవడమే అసలైన నిర్ణయం కాకపోవచ్చునని, కేవలం వొక్కలింగ కమ్యూనిటీ గురించి చూసుకుంటే, మరిన్ని సమస్యలు వస్తాయనే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో తొలగించిన అంబరీష్‌ను కూడా తిరిగి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications