జడెజా పెళ్లిలో కాల్పులు, రుజువైతే మూడేళ్ల జైలు (పిక్చర్స్)

రాజ్‌కోట్: భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి కార్యక్రమంలో ఆదివారం నాడు వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు జరుగుతుండగా కొందరు వక్తులు తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన ఊరేగింపులో పెళ్లి కూతురుకి దగ్గరగా కాల్పులు జరిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తి జడెజా దూరపు బంధువుగా తెలుస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియో పుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో కాల్పులు జరిపినట్లుగా కనిపించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

లైసెన్స్ కలిగిన తుపాకితో కాల్పులు జరిపినా నేరంగా పరిగణించబడుతుందని, నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంటుందని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల చప్పుళ్లకు గుర్రం బెదరడంతో దానిపై ఉన్న రవీంద్ర జడెజా కిందపడ్డంత పని అయింది.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి కార్యక్రమంలో ఆదివారం నాడు వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు జరుగుతుండగా ఓ వ్యక్తి తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ మొదలైంది. మెకానికల్‌ ఇంజినీర్‌ రివా సోలంకిని ఆదివారం జడేజా వివాహం చేసుకున్నాడు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

సంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లికి జడేజా బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ల కారణంగా జడేజా ఐపీఎల్‌ జట్టు గుజరాత్‌ లయన్స్‌ సహచరులు హాజరు కాలేకపోయారు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

సురేష్ రైనా, డ్వేన్ బ్రావో సహా ఆ జట్టు సభ్యులు, భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని, ఇతర క్రికెటర్లు విందు కోసం వచ్చేశారు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

రవీంద్ర జడెజా బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు పలుకుతూ ఇంటివాడయ్యాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రీవా సోలంకిని జడెజా వివాహం చేసుకున్నాడు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

రాజ్‌కోట్‌లోని సీజన్స్ హోటల్లో సంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలో జడెజా, రీవా కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లిలో ఓ దూరపు బంధువు అత్యుత్సాహంతో కాల్పులు జరపడం వివాద్సదమైంది. జడెజా ఎక్కిన గుర్రం బెదిరిపోయింది. జడెజా కిందపడకుండా పక్కనున్న వారు పట్టుకున్నారు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

కాగా, అంతకుముందు సంగీత్‌లో జడెజా - రీవాలు డ్యాన్సుతో అలరించారు. మరీ ముఖ్యంగా జడెజా కత్తిసాము చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

జడెజా పెళ్లి, కాల్పులు

జడెజా పెళ్లి, కాల్పులు

రవీంద్ర జడెజా ఎడమ చేత్తో కత్తిని గిరగిరా తిప్పుతుండగా పక్కనున్న వారు అతనిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+