సన్యాసినిగా హాట్ మోడల్, రోహిత్‌శర్మ మాజీ గర్ల్‌ఫ్రెండ్
ముంబై: మాజీ బిగ్ బాస్ కాంటెస్టెంట్, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ సన్యాసినిగా మారింది. సోఫియా హయత్ క్రికెటర్ రోహిత్ శర్మకు మాజీ ప్రియురాలు. 2012లో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టినప్పుడు నగ్నంగా ఫోటో దిగి, దానిని కానుకగా ఇచ్చింది.
ఆ తర్వాత 2013లో బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీ పడింది. బ్రిటీష్ జాతీయురాలిగా ఓ ప్రముఖ మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జీవితం పైన విరక్తి చెందిందో లేక మరో కారణమో కానీ సన్యాసినిగా మారింది.

తన పేరును గియా సోఫియా మదర్‌గా మార్చుకుంది. సన్యాసి రూపంలోని తన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 31 ఏళ్లు. సన్యాసినిగా మారిన తన పేరు గియా సోఫియా మదర్ అని పేర్కొంది.












Click it and Unblock the Notifications