సర్వే షాక్: సెక్స్ కంటే ఎక్కువ వైఫై కావాలంటున్నారు!
శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని ఐపాస్ సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పడం గమనార్హం.
లండన్: ప్రస్తుత కాలంలో మానవ జీవితంతో టెక్నాలజీకి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ప్రస్తుతం వైఫై ఇంటర్నెట్ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మానవ దైనందిన జీవితాల్లో భాగంగా మారిపోయిన టెక్నాలజీ వారిని పూర్తిగా లోబరుచుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఇంటర్నెట్ వాడకం రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో వైఫై ప్రాధాన్యం మరింత పెరిగింది. మనుషులతో పూర్తిగా పెనవేసుకుని పోయిన వైఫై వారిని శారీరక, మానసిక అవసరాల నుంచి కూడా దూరం చేసిందని అధ్యయనం తెలిపింది.

అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన 'ఐపాస్' అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు. శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని ఐపాస్ సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పడం గమనార్హం.
37 శాతం మంది తమకు శృంగారం అన్నింటికన్నా ముఖ్యం అని తీర్పునివ్వగా చాకొలేట్‌కు మూడో(14 శాతం), మద్యానికి నాల్గవ(9 శాతం) స్థానం దక్కాయి. వైఫై తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. సాంకేతికతను విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని గానీ, దానికి బానిసలా మారిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications