శాంటా క్లాజ్ మాస్కులో వచ్చి విష్ చేశాడు, ఆ తర్వాత..
ఓ వ్యక్తి శాంటా క్లాజా వేషంలో వచ్చి దోచుకెళ్లిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలో మెఫిస్‌లోని ఓ బ్యాంకు వద్దకు ఓ వ్యక్తి శాంటా క్లాజా వేషధారణలో వచ్చాడు.
వాషింగ్టన్: ఓ వ్యక్తి శాంటా క్లాజా వేషంలో వచ్చి దోచుకెళ్లిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలో మెఫిస్‌లోని ఓ బ్యాంకు వద్దకు ఓ వ్యక్తి శాంటా క్లాజా వేషధారణలో వచ్చాడు. ప్రస్తుతం అందరు క్రిస్‌మస్ సంబరాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అతను శాంటాక్లాజా వేషధారణలో వచ్చాడు. అందరికి క్రిస్ మస్ శుభాకాంక్షలు చెప్పాడు. వారికి క్యాండీ క్యాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డాడు.
అతను క్యాండీ కేన్స్ ఇచ్చిన తర్వాత ఓ పేపర్ ముక్కను తన జేబులో నుంచి తీసి అక్కడ టెల్లర్‌కు ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. క్యాండీ క్యాన్స్ ఇచ్చిన అనంతరం అతను డబ్బుల సంచితో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు. నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. కార్టూన్ శాంటా మాస్క్ ధరించిన సదరు వ్యక్తి మెఫిస్ సిటీ ఎంప్లాయి క్రెడిట్ యూనియన్ బ్యాంకుకు బుధవారం ఉదయం పది గంటలకు వెళ్లాడు.
అతను పలువురికి క్యాండీ కేన్స్ ఇచ్చాడని, ఉద్యోగులను, కస్టమర్లను విష్ చేశాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని డిమాండ్ చేసిన లేఖ పెట్టి, వాటిని తీసుకొని వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications