హీరోయిన్ కావాలా, యాంకర్ కావాలా?: అమరావతిలో షాకింగ్??
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వ్యభిచారం హెచ్చుమీరినట్లుగా వార్తలు వస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పలువురు ధనవంతులు, బడాబాబుల సెల్ ఫోన్లకు కొత్తగా మెసేజ్‌లు వస్తున్నాయట. సినిమా హీరోయిన్ కావాలా? ముంబై మోడల్ కావాలా? టీవీ యాంకర్ కావాలా? ఎవరైనా రెడీ అంటూ సందేశాలు వస్తున్నాయి.
విందు, వినోదం, అమ్మాయిలు.. మీరు ఎంచుకున్న రేటుకే అంటూ సందేశాలు వస్తున్నాయట. గుంటూరు, విజయవాడ మధ్య అపార్టుమెంట్ కల్చర్ పెరిగిపోవడం, ఎంతో మంది ధనవంతులు వచ్చి నివాసం ఉంటుండటంతో ఎంపిక చేసుకున్న వారికి వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికకగా, అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్‌కు తెరదీశారు. టెక్నాలజీని ఇందుకోసం వాడుకుంటున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ సెల్‌ఫోన్ సంభాషణ ఓ మీడియా చేతికి చిక్కినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం.. ఫోటోను చూసి అమ్మాయి నచ్చితే వారు చెప్పిన అపార్టుమెంట్‌కు వెళ్లాలని, అక్కడికి వెళ్లి చూస్తామంటే కుదరదని, ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి వారు చెప్పిన అపార్టుమెంట్‌కు వెళ్లి అమ్మాయితో గడపవచ్చునని, కావాలంటే బయటకు కూడా తీసుకు వెళ్లవచ్చునట.












Click it and Unblock the Notifications