‘మన్మోహన్ మాట్లాడారు! మోడీ అచ్చేదిన్ వచ్చేసినట్లే’: పేలిన జోకులు

రాజ్యసభలో మాట్లాడుతూ.. గురువారం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తన మనోగతాన్ని వెలిబుచ్చారు మన్మోహన్.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దుపై గురువారం రాజ్యసభలో చేపట్టిన చర్చ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. గతంలో ఎన్ని చర్చలు జరిగినా పెద్దగా స్పందించకుండా.. మాట్లాడకుండా ఉన్న మన్మోహన్‌ ఒకేసారి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై నెటిజన్లు సరదాగా స్పందించారు.

రాజ్యసభలో మాట్లాడుతూ.. గురువారం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తన మనోగతాన్ని వెలిబుచ్చారు మన్మోహన్. దీనిపై నెటిజన్లు కొందరు కామెంట్లు చేస్తే, మరికొందరు ఆయన మాట్లాడిన దానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పలువురు నెటిజన్ల కామెంట్లు ఇలావున్నాయి..

'మోడీ చెప్పిన అచ్చేదిన్ వచ్చినట్లేవుంది.. ఎందుకంటే యూపీఏ పదేళ్ల పాలనలో మాట్లాడలేని మన్మోహన్ సింగ్ కూడా.. మోడీ సర్కారు హయాంలో మాట్లాడుతున్నారు'

'మోడీకి ఇది పెద్ద అచీవ్‌మెంట్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో మాట్లాడటమే కాదు.. ఆయన ప్రజల సమస్యలపై కూడా తన గళం వినిపించారు'

Social Humour: Twitter reacts as Manmohan Singh breaks his silence in Rajya Sabha

'మన్మోహన్‌ సింగ్‌ స్పీచ్‌ అయిపోయింది, ఇక లే' అని కేజ్రీవాల్‌ సిసోడియాను నిద్ర లేపుతున్న ఒక ఫోటోను ఈ సందర్భంగా కొందరు పోస్ట్‌ చేశారు.

'మేడం చెప్పిన ఈ మాటలను నేను రిపీట్‌ చేస్తున్నాను. ఐయామ్‌ సో సారీ'

'బ్రేకింగ్‌ న్యూస్‌.. మన్మోహన్‌సింగ్‌ తన గొంతును కనుగొన్నారు. ఇప్పుడు ఇక రాహుల్‌ బుర్ర ఎక్కడుందో కాంగ్రెస్‌ నేతలు కనుగొనాలి' అంటూ పలువురు వ్యంగ్యంగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+