కాలేజీ ఇలా, బోర్డ్ అలా: ప్రత్యూష పాసా? ఫెయిలా?
హైదరాబాద్: ప్రత్యూష.. సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఎన్జీఓ సంస్థలు, మీడియా, కోర్టుతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చొరవతో నూతన జీవితాన్ని ప్రారంభించిన ఆమె అందరికీ తెలిసిన అమ్మాయే. అయితే, ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఆమెను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఈ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలన్న ప్రత్యూష కోరిక తీరుతుందో లేదో అనే అనుమానం నెలకొంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసైనప్పటికీ.. ఆమెకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సెయింట్ డేనియల్ వొకేషనల్ కళాశాల ఆ వివరాలను సకాలంలో ఇంటర్‌బోర్డుకు పంపలేదు.

ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రత్యూష హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఫలితాలు చూడగా ఫెయిలైనట్లు వచ్చింది. ఈ విషయమై ప్రత్యూషను ఓ మీడియా ఫోన్‌లో సంప్రదించగా, తాను ప్రాక్టికల్స్‌తో పాటు, అన్ని పరీక్షలు బాగా రాశానని తెలిపింది.
ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రతినిధి విజయను ప్రశిస్తే.. ప్రత్యూషకు రెండు హాల్ టికెట్ నెంబర్లున్నాయని, ప్రాక్టికల్స్ తమ వద్ద, రాత పరీక్షలు నారాయణ కళాశాలలో రాసిందని పేర్కొన్నారు. తమ వద్ద నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో పాసైందని, ఈ మార్కుల వివరాలు ఇంటర్ బోర్డుకు అందజేస్తామని ఆమె చెప్పారు. అయితే ఈ మార్కుల వివరాలను పరిగణలోకి తీసుకుని.. ఇంటర్ బోర్డు ప్రత్యూషను పాస్ చేస్తుందో లేదో వేచి చూడాలి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications