ఎరుపెక్కిన నది.. రక్తమా..! అసలెందుకలా? ఎక్కడ?
రష్యా : పారిశ్రామిక వ్యర్థాలు నదీ జలాల్లో కలవడం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వేధిస్తోన్న సమస్య. పారిశ్రామికీకరణకు మొగ్గు చూపే ప్రభుత్వాలు.. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్యంపై ఫోకస్ చేయకపోవడం నది జలాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రస్తుతం ఇదే సమస్య తీవ్రతరంగా మారి.. రష్యాలో ఏకంగా ఓ నది ఎరుపులో రంగులోకి మారిపోయింది. రష్యాలోని నోర్కిల్స్ నగరం మీదుగా మీదుగా ప్రవహించే డాల్టికాన్ నది దుస్థితి ఇది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఆ నది ఇప్పుడు ఎరుపు వర్ణం సంతరించుకుని ప్రవహిస్తోంది.

పారిశ్రామిక రసాయన వ్యర్థాలు నది జలాల్లో కలుస్తుండడంతో.. నది ఇలా ఎరుపు రంగులోకి మారిపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజల దాహాన్ని తీర్చిన డాల్టికన్ నది నీళ్లు.. ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయిన పరిస్థితి. ఆ నీటివైపు చూడడానికి కూడా జనం సంశయిస్తున్నారంటే.. కాలుష్య స్థాయి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే నది ఎరుపెక్కడం గురించి ఇప్పటిదాకా శాస్త్రీయమైన కారణాలేవి అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. దీంతో మరో కారణం కూడా తెర పైకి వచ్చింది. నది లోపల్లోని భూపొరల్లో ఐరన్ స్థాయి ఎక్కువగా ఉండడంతో.. నది ఇలా ఎరుపు రంగును సంతరించుకుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో, ప్రస్తుతం దీనికి గల స్పష్టమైన కారణాలను గుర్తించే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం.












Click it and Unblock the Notifications