రెండు తలల పాము: ధర రూ.35 లక్షలు
హైదరాబాద్: రెండు తలల పాము ఇంట్లో ఉంటే మంచిది అని చాలామంది నమ్ముతారు. రెండు తలల పామును పెద్ద మొత్తం ఇచ్చి కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అలాగే, హైదరాబాదులో ఓ రెండు తలల పామును అమ్మే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన వెంకటేశ్ (35), తిరుపతి (30) అన్నదమ్ములు. హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారంలో ఉంటున్నారు. రెండు తలల పాముతో చాలా ప్రయోజనాలుంటాయని వీరు ప్రజల్ని నమ్మిస్తుంటారు.

నమ్మిన వారికి రెండు తలల పామును విక్రయించడం వీరి పని. సోమవారం వీరికి రెండు తలల పాము దొరికింది. దీనిని విక్రయించడానికి కండ్లకోయకు తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకుని వెంకటేశ్, తిరుపతిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అది అసలు రెండు తలల పాము కాదని కూడా తెలుస్తోంది. వారు తీసుకు వచ్చిన పాము తోక తల వలె ఉంటుంది. దీంతో దానిని కూడా రెండు తలల పాముగా నమ్మించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications