కుక్క ఎంత పనిచేసింది?: ఇష్టం లేదు, పెళ్ళి రద్దు చేసుకున్న బెంగుళూరు యువతి

బెంగుళూరు: తనకి కాబోయే భర్త పెంపుడు కుక్కను ఇష్టపడకపోవడంతో ఓ యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న వింత సంఘటన కర్నాటర రాజధాని బెంగుళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియాకు రిష్తా అనే వ్యక్తితో పెళ్ళి సంబంధం కుదిరింది.

స్వతహాగా జంతువులంటే ఎంతో ఇష్టమున్న కరిష్మా వాలియాకు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా కుక్కును తన వద్దే ఉంచుకుంటానని కాబోయే భర్తతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చాట్‌ చేస్తూ అతడితో చెప్పింది. అయితే అతడు తనకు కుక్కలు అంటే ఇష్టం లేదని చెప్పాడు.

Bengaluru Woman

తన తల్లికి కూడా కుక్కలంటే ఇష్టం లేదని, తమ ఇద్దరి మధ్య కుక్క ఎందుకని ప్రశ్నించాడు. దీంతో మన పెళ్ళి జరగదని కరిష్మా అతడితో తెగేసి చెప్పింది. సీరియస్‌గా చెబుతున్నావా? అని ప్రశ్నించగా అవుననే సమాధానమిచ్చింది. మనిద్దరి జీవితం ముఖ్యమని, కుక్కతో నీ అనుబంధం తాత్కాలికమేనన్న అతడి వాదనతో ఆమె ఏకీభవించలేదు.

అంతేకాదు కుక్కతో తన అనుబంధం తాత్కాలికమే అయినా, తన పెంపుడు కుక్కను పెళ్లి కోసం వదులుకోలేనని తేల్చిచెప్పింది. పెళ్ళి తర్వాత దీని కారణంగా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరగదని స్పష్టం చేసింది. దీంతో కోపద్రిక్తుడైన ఆ కాబోయే పెళ్లి కొడుకు నీ కుక్కనే పెళ్ళి చేసుకో అని సమాధానమిచ్చాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదనలు అనవసరమని కరిష్మా సూటిగా చెప్పడంతో అక్కడితో వాట్సప్ చాట్‌లో వారిద్దరి మాటలకు బ్రేక్ పడింది. కుక్క కారణంగా ఓ పెళ్ళి రద్దైన ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు కరిష్మా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయగా, మరి కొందరు రిష్తా వాదనకు మద్దతు పలకడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+