గేల్‌ను 'లూజర్' అని గేలి చేసిన జమైకా చిరుత (వీడియో)
న్యూఢిల్లీ: ప్రపంచ ట్వంటీ 20 కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పైన వెస్టిండీస్ గెలిచి.. కప్ సొంతం చేసుకుంది. దీంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అంతులేదు. వారు ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు. విండీస్ జట్టు గెలుపు నేపథ్యంలో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కూడా సంబరాలు చేసుకున్నాడు.
విండీస్ జట్టుకు బోల్ట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను పంపించాడు. ఈ వీడియోలో డ్వెన్ బ్రావో రాసి, ఆలపించిన ఛాంపియన్స్ గీతాన్ని తను కూడా పాడాడు. ప్రతి విండీస్ ఆటగాడి పేరును ఈ పాటలో జత చేశాడు. చివరలో క్రిస్ గేల్‌ను లూజర్ అన్నాడు.

కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్లో క్రిస్ గేల్ విఫలం కావడం పట్ల బోల్ట్ అలా అని ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. తన వీడియోలో మార్లోన్ ఛాంపియన్, సామ్యూల్స్ ఛాంపియన్, కార్లోస్ ఛాంపియన్, బ్రావో ఛాంపియన్, గేల్ ఛాంపియన్ అని తొలుత అన్నాడు. ఆ తర్వాత చివర్లో మాత్రం గేల్ 'లూజర్' అని పేర్కొన్నాడు.
Usain bolt's celebration 😂😂😂 #WT20Final pic.twitter.com/Ed34nuXZi3
— Miss Pearson Specter (@imisaaay) April 3, 2016
ట్వంటీ 20 ఛాంపియన్ వెస్టిండీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వారు కప్ గెలిచిన సంబరాలు ఇంకా జరుపుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ పైన విండీస్ గెలిచింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications