పాక్ ఉక్కిరిబిక్కిరి: సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని చెప్పేందుకు తిప్పలు
న్యూఢిల్లీ: పీవోకేలో భారత్ సర్జికల్ స్ట్రయిక్‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలు అలాంటివి జరగలేదని చెప్పేందుకు తంటాలు పడుతోంది. తమ దేశంలో సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని అన్ని దిన పత్రికల్లోను వేయించారు.
పైగా, భారత్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు తామే భారత సైనికులను హతమార్చామని కథనాలు వండి వార్చింది. 8 నుంచి 14 మంది సైనికులను హతమార్చినట్లు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఓ వైపు ఐక్య రాజ్య సమితిలో ఒంటరి, సార్క్ దేశాల దెబ్బ, పైగా సర్జికల్ స్ట్రయిక్.. దీంతో పాక్ ఏకాకి అయింది. సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. దానిని అధిగించేందుకు భారత్ పైన ఒత్తిడి పెంచేందుకు తామే ఇండియన్ ఆర్మీని చంపేశామని చెప్పింది.

సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ మరో ఎత్తుగడ వేసింది. పలువురు జర్నలిస్టులను సర్జికల్ స్ట్రయిక్ దాడులు జరిగాయని భావిస్తున్న బగ్ సిర్ వద్దనున్న ఆధీన రేఖ వద్దకు హెలికాప్టర్ ద్వారా తీసుకు వెళ్లింది.
భారత దళాలు ఉగ్రవాదులను ఏరివేసిన ఈ ప్రాంతం భింబర్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోకి జర్నలిస్టులను తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ ప్రాంతంలోకి చీమ కూడా చొరబడే అవకాశం లేదని, అంతలా పర్యవేక్షణ ఉంటుందని చెప్పించింది. కాగా, భారత్ దాడి చేస్తే తడాఖా చూపిస్తామని పాక్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.












Click it and Unblock the Notifications