మోడీ హెయిర్‌స్టైల్ మారింది: ఎంపీల గుసగుసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే తన హెయిర్ స్టైల్(తలకట్టు) మార్చేశారు. ఆయనను శ్రద్ధగా గమనిస్తే ఆ మార్పు కనిపిస్తోంది. అయితే అది ఎందుకు అలా మారిందో ఆయన్ని అడిగేందుకు మాత్రం ఎవరూ సాహసించడం లేదు. పార్లమెంటు సమావేశాలకు ఆయన తాజా హెయిర్ స్టైల్‌తో హాజరవడంతో ప్రస్తుత సమావేశాల్లో పలువురు ఎంపీలు దానిపై గుసగుసలాడుకుంటూ చర్చించుకుంటున్నారు.
మోడీ మొదట్లో ఎడమ వైపు పాపిడి వదిలి కుడివైపునకు తల దువ్వుకునేవారు. ఫిబ్రవరి 23వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి జుట్టును ముందు నుంచి వెనకవైపునకు దువ్వుతున్నారు.
ఈ తలకట్టులో పాపిడి కనిపించదు. తల వెనకభాగాన వంకీలు తిరిగిన జుట్టు కనిపిస్తోంది. కాగా, ఇది పూర్తిగా ప్రధాని వ్యక్తిగతమైన విషయం కావడంతో తామెవరూ ఆయన్ని అడగడం లేదని సీనియర్ కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు.

గత సెప్టెంబరు 22న అమర్‌జవాన్ జ్యోతి వద్ద మృతవీరులకు నివాళులు అర్పించే సమయంలో గాలికి ఎగిరిన తన జుట్టు గురించి చర్చ జరగడంతో మోడీ తలకట్టును మార్చి ఉంటారని మరో మంత్రి పేర్కొన్నారు.
కాగా, మోడీ హెయిర్ స్టైలిస్ట్ ఎవరంటూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మరో అంశం దొరికిందంటూ మరికొందరు ఆ పార్టీపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications