వృద్ధుడిని పెళ్లాడిన యువతి: తన ‘తాత’ అని తెలుసుకుని షాక్!

వాషింగ్టన్‌: పాశ్చాత్య దేశాల్లో వారి సంస్కృతే వేరు. వివాహ సమయంలో వారికేలాంటి పట్టింపులు ఉండవు. వయస్సు ఎక్కువ తక్కువలతో సంబంధమే లేదు. యువతులు నడివయస్కులను, వృద్ధులను పెళ్లి చేసుకోవడం సాధారణమే అయిపోయింది. అంతేగాక, వారెంత కాలం కలిసి వుంటారో కూడా చెప్పలేం. పెళ్లైన తర్వాత విడిపోయి తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం కూడా అక్కడ సర్వ సాధారణమే.

ఈ సంస్కృతే ఓ యువతిని చిక్కుల్లో పడేసింది. 24 ఆ యువతి 68ఏళ్ల ఓ వృద్ధుడితో మూడు నెలల క్రితం వివాహం చేసుకుంది. సాజావుగా కాపురం సాగిపోతుండగా, అతని ఇంట్లోని ఫ్యామిలీ ఫొటోలు ఆమెను షాక్ కు గురిచేశాయి. ఎందుకంటే ఆమె పెళ్లాడింది స్వయాన ఆమె తాతనే కావడం గమనార్హం.

కాగా, ఆ వృద్ధుడికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి భార్య పిల్లలతో సహా అతడిని విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా కాలం వెతికినా లాభం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, రెండో పెళ్లి అయ్యాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను పోషించలేక ఆమెను నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు.

Woman Discovers Husband Is Her Own Grandfather

అయితే అనుకోకుండా గత ఏడాది అతడికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. దీంతో 68 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా చివరికి తన మనవరాలినే పెళ్లాడాడు.

అయితే, ఆ యువతికి పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆమె తండ్రి ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో ఆమె ఈ వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ వృద్ధుడికి ఆమె తన మనవరాలనే విషయం పెళ్లికి ముందు తెలియదు. కానీ, ఆ యువతి మాత్రం ఇప్పటికీ ఏం సమస్యే లేదంటోంది. అంతేగాక, తన తాత అయినంత మాత్రాన తాము విడిపోవాల్సిన అవసరం లేదని సదరు యువతి తెగేసి చెప్పడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+