యువతి బెడ్‌రూంలో దెయ్యం: ఏం చేసిందో చూడండి(వీడియో)

చికాగో: ఓ యువతి గాఢమైన నిద్రలో ఉంది. అదే సమయంలో పడుకున్న పడక గది తెరుచుకుంది. ఆ తర్వాత ఆమె కప్పుకున్న దుప్పటి ఎగిరిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమె మెలకువలోకి వచ్చి ఆందోళనకు గురైంది. వెంటనే లైట్లు వేసి చూడగా అక్కడ ఆమెకు ఏమీ కనిపించలేదు. దీంతో తలుపు, తన దుప్పటి తీసింది దెయ్యమే అనుకుని ఆమె రాత్రి నిద్ర పోకుండా జాగారం చేయాల్సి వచ్చింది.

హారర్ చిత్రాల్లో మాత్రమే కపినించే ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చికాగోలోని తన నివాసంలో ఐరీష్‌ అలమో అనే యువతి తన పడకగదిలో నిద్రపోగానే భయాందోళన కలిగించే ఘటన చోటు చేసుకునేది. రోజూ అర్థరాత్రి వేళ తను కప్పుకున్న బెడ్‌షీట్‌ను ఎవరో లాగుతున్నట్లు అనిపించి ఉలిక్కి పడి లేచేది.

దీంతో అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారనేది తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఆ సీసీ పుటేజిని మరుసటి రోజు పరిశీలించగానే ఆమెకో షాకింగ్ విషయం తెలిసింది. ఆమె బెడ్‌షీట్ ఎవరు లాగేస్తున్నారో తెలుసుకని కంగు తింది.

దాదాపు సంవత్సరం నుంచి ఆమె ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆ సీసీ పుటేజిని పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సంచలనం కోసం ఇదంతా కావాలని సృష్టించిందని అంటున్నారు. కొందరు మాత్రం ఆమె చెప్పినట్లు దెయ్యం ఉందని నమ్ముతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+