సినిమాను తలపించిన జీవితం,సంపన్నులకు వల వేసి పదకొండు మందిని పెళ్ళి చేసుకొంది

సంపన్నుల మ్యాట్రిమోని ద్వారా వల వేసి వివాహం చేసుకొని వారి ఇంటి నుండి నగలు, నగదును తీసుకొని పారిపోయేది మేఘ అనే యువతి. సినిమా తలపించే రీతిలో ఆమె పదకొండు మందిని వివాహం చేసుకొంది. వారి ఇంట్లో నుండి నగదు,

నోయిడా :ఒకరిని కాదు ఏకంగా పదకొండు మందిని వివాహం చేసుకొంది. వీలు చూసుకొని ఇంట్లోని డబ్బులు, నగలు తీసుకొని పారిపోయేది,మరో వ్యక్తిని వివాహం చేసుకొోనేది సినిమా స్టోరిని తలపించేవిధంగా ఓ మహిళ పదకొండు మందిని వివాహం చేసుకొంది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సంపన్నులను లక్ష్యంగా చేసుకొని ఆమె వివాహలు చేసుకోనేది. కొంతకాలంపాటు కాపురం చేసి డబ్బులు, నగలతో పారిపోయేది. ఈ ఘటన నోయిడాలో చోటచేసుకొంది.

సంపన్నులైన వారు వధువు కోసం ఇచ్చిన ప్రకటనలను ఆసరాగాచేసుకొని ఆమె వారితో వివాహం చేసుకోనేది. కొంత కాలం పాటు వారితో కాపురం చేసేది.ఆమెను నమ్మిన తర్వాత ఇంట్లోని నగదు, నగలతో ఆమె పారిపోయేది. అయితే ఈమె సీరియల్ పెళ్ళిళ్ళకు కోచికి చెందిన లోరేన్ జస్టిస్ పల్ స్టాప్ పెట్టాడు.

 woman who duped 11 husbands nabbed

ఈ ఏడాది అక్టోబర్ లో తన భార్య మేఘ కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.

మేఘతో పాటు 15 లక్షల నగదు, నగలు మాయమయ్యాయని ఆమె భర్త లోరేన్ జస్టిస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు మేఘ సోదరి ప్రాచి, ఆమె భర్త దేవేంద్రశర్మలను అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

లోరేన్ కంటే ముందే ఆమె కేరళలోనే మరో ముగ్గురిని వివాహం చేసుకొంది. కొన్ని నెలల తర్వాత సమయం చూసుకొని నగలు, నగదుతో పారిపోయిందని వారు పోలీసులకు వివరించారు.

సంపన్నులకు ఎర వేసి వివాహం

మ్యాట్రిమోని ద్వారా వధువుల కోసం ప్రకటనలు ఇచ్చే సంపన్నులను ముందుగా ఆమె గుర్తించేది. వారికి వల వేసేది. వారిని వివాహం చేసుకొనేది .పెళ్ళి చేసుకొన్న తర్వాత భర్తలతో పాటు, వారి కుటుంబసభ్యులను నమ్మించేది ,.ఆమెను నమ్మిన వారు ఇంట్లోని వస్తువులను ఆమెకు కట్టబెట్టేవారు.నగదును, నగలను తీసుకొని ఆమె పారిపోయేది. మేఘ సోదరి ప్రాచి, ఆమె భర్త దేవేంద్ర సహయంతో ఆమె పదకొండు మందిని వివాహం చేసుకొందని తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+