కొడుకు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్: తండ్రి మాత్రం కూలీగానే!
తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్న ఆ తండ్రి చివరకు తాను అనుకున్నది సాధించాడు. కూలీగా పని చేసుకుంటూ తన కొడుకును చదివించడంతో అతడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్.
జైపూర్: తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్న ఆ తండ్రి చివరకు తాను అనుకున్నది సాధించాడు. కూలీగా పని చేసుకుంటూ తన కొడుకును చదివించడంతో అతడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా భారీ ప్యాకేజీతో చేరాడు. ప్రస్తుతం అతడు సియాటెల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా, కొడుకు పెద్ద ఉద్యోగంతో బాగానే సంపాదిస్తుండగా తానెందుకు పని చేయాలని ఆ తండ్రి అనుకోలేదు. కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నా తాను మాత్రం ఇప్పటికీ కూలి పనులకు వెళ్తూ సాధారణ జీవనం గడుపుతున్నాడు. కష్టపడేతత్వానికి అలవాటు పడ్డ తనకి కూలికి వెళ్లడంలోనే ఆనందం ఉందంటున్నాడు ఆ ఆదర్శ తండ్రి.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సోజత్‌కు చెందిన తేజారామ్ రోజు కూలీ. కొడుకు రామచంద్రను కష్టపడి చదివించాడు. హిందీ మీడియం విద్యార్థి అయిన రామచంద్ర ఆంగ్ల సినిమా సబ్‌టైటిళ్లను చదువుతూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాడు. 70 శాతం మార్కులతో 12వ తరగతి పాసయ్యాడు. అతడిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని కోటాలో ఐఐటీ-జేఈఈకి కోచింగ్ ఇప్పించాడు ఆ తండ్రి. అందుకోసం తెలిసినవారి వారందరి దగ్గరా అప్పులు చేశాడు.
అనుకున్నట్లే ఉన్నత చదువు చదివిన రామచంద్రను అదృష్టం వరించింది. ఏకంగా గూగుల్‌లోనే ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో లక్షల్లో గడిస్తున్న రామచంద్ర ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అప్పులన్నీ తీర్చేశాడు. ఊళ్లో కొంత భూమి కూడా కొన్నాడు. ఇంటిని తల్లిదండ్రులకోసం సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు.
అయితే, తండ్రిని మాత్రం మార్చలేకపోయాడు. రోజూ కూలికి వెళ్లి రూ.100నుంచి 400 వరకు సంపాదిస్తూ ఆ మొత్తంతోనే జీవితాన్ని సాగిస్తున్నాడు అతడి తండ్రి. కూలికి వెళ్లొద్దని కొడుకు ఎంత వారించినా తనకు అందులోనే సంతోషం ఉంటుందంటున్నాడు తండ్రి. దీంతో తనకు ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నాడు కొడుకు రామచంద్ర. కాగా, కొడుకును ఉన్నతుడిగా తీర్చిదిద్దిన తండ్రి.. తన తండ్రి ఇంకా కష్టపడకూడదనుకనే కొడునుకు చూసి స్థానికులు ముచ్చటపడుతున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications