‘సెల్‌ఫోన్ కొనివ్వట్లేదు! మా అమ్మను అరెస్ట్ చేయండి’
‘సెల్‌ఫోన్ కొనివ్వడంలేదు.. మా అమ్మను అరెస్టు చేయండి’ అంటూ ఓ ఏడో తరగతి చదువుతున్న బాలుడు పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు.
చెన్నై: నేటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్‌ఫోన్లు లేకుండా బతకలేమనే పరిస్థితికి వచ్చారంటే అతిశయోక్తి కాదేమో. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాలా మంది సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటం గమనార్హం. సెల్ఫీలు తీసుకుంటూ పలువురు ప్రాణాలు తీసుకుంటుంటే.. సెల్‌ఫోన్ల కోసం పలువురు తమ విచక్షణను కోల్పోతున్నారు.
తాజాగా తమిళనాడులో జరిగిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. 'సెల్‌ఫోన్ కొనివ్వడంలేదు.. మా అమ్మను అరెస్టు చేయండి' అంటూ ఓ ఏడో తరగతి చదువుతున్న బాలుడు పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి ముత్తయ్యపురం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గణేశ్ ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బిగ్గరగా ఏడుస్తూ తన తల్లిని అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు. అతడిని బుజ్జగించి ఎందుకని ప్రశ్నించగా.. సెల్‌ఫోన్ కొనివ్వడం లేదని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.
ఆ తర్వాత గణేశ్ తల్లిదండ్రులను రప్పించి మాట్లాడారు. పేదరికంతో ఉన్న తాము సెల్‌ఫోన్ కొనివ్వలేమని చెప్పినా.. అతడు పట్టువీడటం లేదని వారు తెలిపారు. ఆ బాలుడు ఉన్నట్టుండి తల్లిని అరెస్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదరించడంతో పోలీసులు మరింత షాక్‌కు గురయ్యారు. చివరకు పోలీసులు తమదైన శైలిలో ఆ బాలుడికి సమాధానం చెప్పి తల్లిదండ్రులతో పంపించేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications