తెల్ల చొక్కాలు, ముహూర్తాలు: పూరీ బాటలో సిట్ ముందుకు సినీనటులు!
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులందుకున్న సినీ ప్రముఖులు తమ సెంటిమెంట్లను కొనసాగిస్తున్నారు. సిట్ విచారణకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి, పురోహితుల సూచనల మేరకు ముహూర్తాలు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులందుకున్న సినీ ప్రముఖులు తమ సెంటిమెంట్లను కొనసాగిస్తున్నారు. సిట్ విచారణకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి, పురోహితుల సూచనల మేరకు ముహూర్తాలు చూసుకుని మరీ విచారణకు వస్తుండటం గమనార్హం.

తెల్లచొక్కాలే..
అంతేగాక, విచారణ ఎదుర్కొంటున్న వారిలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే ఇప్పుటి వరకు సిట్ విచారణకు వచ్చిన వారు తెల్లచొక్కాలతో రావడం విశేషం. వీరంతా తెల్లచొక్కాలను సెంటిమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలుకుని తెల్లచొక్కాల సెంటిమెంట్‌ను మిగతా సెలబ్రిటీలు కొనసాగిస్తున్నారు.
Recommended Video


శ్యామ్ కే నాయుడు మినహా..
నోటీసులందుకుని సిట్ ముందు హాజరైన శ్యామ్ కే నాయుడు మినహా అందరూ తెల్లచొక్కాల్లోనే రావడం గమనార్హం. ఈయన మాత్రం బ్లూ షర్టులో హాజరయ్యారు.

పూరీ బాటలోనే..
నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, నవదీప్ తెల్లచొక్కాలతో వచ్చి పూరీ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న మిగతా సెలబ్రిటీలు పూరి బాటలో నడుస్తున్నారని భావిస్తున్నారు.

ఇష్టదేవతలకు ఆరాధనలు
సిట్ వద్దకు వెళ్లే ముందు నటులు ముహుర్తాలను చూసుకోవడం, ఇష్ట దైవాలను ప్రార్థించడం గమనార్హం. తరుణ్ కూడా సిట్ వచ్చే దారిలోనే ఓ ఆలయానికి వెళ్ళి ప్రార్థించినట్లు తెలిసింది.

నవదీప్
ఇది ఇలావుంటే జీషన్‌అలీ, కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నవదీప్ విచారణను సిట్ విచారిస్తోంది. పబ్బుల్లో జీషన్ అలీ ద్వారానే హైక్వాలిటీ కొకైన్ సరఫరా చేసినట్లు నవదీప్‌పై ఆరోపలున్నాయి. పక్కా ఆధారాలతో నవదీప్‌ను సిట్ విచారిస్తోంది. తరుణ్ విచారణలో వెలుగులోకి వచ్చిన పబ్‌లకు సంబంధించిన చీకటి కోణాలను, కొన్ని పబ్‌ల్లో సీక్రెట్ గదుల ఏర్పాటుపైనా సిట్ విచారణ చేస్తోంది. కెల్విన్‌తో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications