జనగామలో మూడుకాళ్లతో పుట్టిన పాప
జనగామ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ఓ పాప మూడు కాళ్లతో పుట్టింది.
జనగామ: జనగామ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ఓ పాప మూడు కాళ్లతో పుట్టింది. జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన శ్రీలత-సాంబయ్య దంపతులకు మొదటి సంతానం బాబు కాగా రెండో కాన్పు కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు సాధారణ డెలివరీ చేయగా శ్రీలత పండిం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాపకు మూడు కాళ్లుండడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వైద్యులు పాపకు ప్రత్యేక చికిత్స అందించారు.

ఎలాంటి సమస్య లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందన్నారు. పిల్లల వైద్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మేనరికం వివాహాలతో ఇలాంటి శిశువులు జన్మించే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మూడో కాలు తొలగించవచ్చన్నారు. మాతా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications