ఐఫోన్ కొట్టేసి సెల్ఫీ తీసుకున్న కోతి: ఇప్పుడది సెలబ్రిటీ!
బర్మింగ్‌హామ్: మనుషులే కాదు తాము కూడా సెల్ఫీలు తీసుకోగలమని నిరూపించింది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన ఓ కోతి. సదరు కోతి ఓ టూరిస్ట్ చేతిలోని ఐఫోన్ లాక్కుని సెల్ఫీ దిగడం గమనార్హం. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని జూలో చోటుచేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. రెబెక్కా అనే యువతి ఆ జూకి వెళ్లింది. అక్కడవున్న కాపుచిన్ జాతికి చెందిన రొమాని అనే కోతిని రెబెక్కా ఫొటో తీయాలనుకుంది. ఇంతలో రొమాని ఫెన్సింగ్ వద్దకు వచ్చి రెబెక్కా ఫోన్‌లాక్కొని చక్కగా సెల్ఫీ దిగింది. దీంతో అక్కడున్న పర్యాటకులంతా అవాక్కయ్యారు.

ఫోన్ లాక్కున్న సమయంలో కోతి చేయి కెమెరా బటన్‌పై పడటంతో ఇలా దాని సెల్ఫీ వచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతంగా లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి.
మనుషుల కంటే కోతులే బాగా ఫొటోలు దిగేస్తున్నాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రొమాని(కోటి) బర్మింగ్‌హామ్ జూలోనేగాక సోషల్ మీడియాలోనూ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications