బీజేపీ ఎమ్మెల్యే తిట్లదండకం, ఏడ్చిన ఐపీఎస్ అధికారిణి
బీజేపీ ఎమ్మెల్యే, ఓ పోలీసు అధికారిణికి మధ్య జరిగిన సంభాషణ ఆమె కంటనీరు పెట్టించింది. అక్రమ సారా విక్రయాలపై కొందరు మహిళలు కొయిల్వా గ్రామం సమీపంలో ఆందోళనకు దిగారు.
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే, ఓ పోలీసు అధికారిణికి మధ్య జరిగిన సంభాషణ ఆమె కంటనీరు పెట్టించింది. అక్రమ సారా విక్రయాలపై కొందరు మహిళలు కొయిల్వా గ్రామం సమీపంలో ఆందోళనకు దిగారు.
పోలీసుల లాఠీఛార్జిలో మహిళలు గాయపడ్డారు. గోరఖ్‌పూర్‌కు చెందిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాధా మోహన్‌దాస్ అగర్వాల్ రంగంలోకి దిగారు. అక్కడే ఉన్న మహిళా ఐపీఎస్ అధికారి చారునిగమ్‌తో వాదానికి దిగారు.

దీంతో చేతి రుమాలుతో ఐపీఎస్ అధికారిణి చారు నిగమ్ కన్నీరు తుడుచుకుంటున్న దృశ్యాన్ని మీడియా ప్రతినిధులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. చారు నిగమ్ 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి.
గొడవ సమయంలో ఆమెతో వాగ్వాదానికి దిగిన రాధామోహన్ దాస్.. నువ్వు హద్దులు దాటొద్దంటూ హెచ్చరించారు. నేను నీతో మాట్లాడటం లేదని, తనకేమీ చెప్పవద్దని, హద్దులు దాటవద్దని వ్యాఖ్యానించారు.
దానికి ఆమె.. తాను ఇక్కడ ఇంచార్జ్ అధికారినని, తానేం చేస్తున్నానో తనకు తెలుసునని చారూ నిగమ్ చెప్పారు. అయినా ఎమ్మెల్యే తిట్టారు. దీంతో ఆమె ఓ హ్యాండ్ కర్చీఫ్‌తో ఆమె కళ్లు తుడుచుకుంటూ వెళ్లారు.












Click it and Unblock the Notifications