బీజేపీ బిగ్ ప్లాన్!?: రంగంలోకి ప్రభాస్!, పవన్‌కు చెక్ పెట్టి మైలేజీ పెంచుకునేలా!..
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోవడంతో.. ఇప్పుడా ఇమేజ్‌ను రాజకీయాల్లో వాడుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: సినిమాలకు-రాజకీయాలకు ఉన్న లింకు మన దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సినీ గ్లామర్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లో లబ్ది పొందాలనుకునే పార్టీలు, వ్యక్తులు మన దగ్గర చాలామందే ఉన్నారు. అయితే సినీ గ్లామర్ తోనే అద్భుతాలు జరిగిపోతాయనుకునేవారికి.. చిరంజీవి ప్రజారాజ్యం ప్రస్థానం ఒక హెచ్చరిక లాంటిదన్న సంగతి మరిచిపోకూడదు.
ఒకప్పుడు తమిళ గడ్డపై ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ వంటి మహా నటులు రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనంతో.. సినీ గ్లామర్ రాజకీయాలకు కలిసొస్తుందనే భావన పార్టీల్లోను పెరిగింది. అందుకే దేశంలో చాలా పార్టీలు ఎన్నికల సమయంలో జనాకర్షణ ఉన్న సినీ నటులు లేదా నటీమణులను రంగంలోకి దించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.

తెరపైకి ప్రభాస్:
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోవడంతో.. ఇప్పుడా ఇమేజ్‌ను రాజకీయాల్లో వాడుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి.. సదరు జాతీయ పార్టీ బీజేపీయే అన్న వాదన కూడా వినిపిస్తోంది.
దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటినుంచో కాచుకు కూర్చొన్న బీజేపీ.. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఇదే క్రమంలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో కొత్త వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో భాగంగానే.. 'ప్రభాస్'ను స్టార్ క్యాంపెయిన్ గా వాడుకోవాలన్న ఆలోచన మెదిలినట్లుగా చెబుతున్నారు.

తమిళనాట 'రజనీ' వ్యూహం కలిసిరాలేదు:
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో.. ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా బీజేపీ పావులు కదిపింది. ముఖ్యంగా అన్నాడీఎంకెలో చీలికలు.. మొన్నటి ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దు వంటి పరిణామాలు బీజేపీ చలవే అన్న వాదన లేకపోలేదు.
ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'మా వాడే' అని ప్రచారం చేసుకోవడం ద్వారా అక్కడి జనంలోకి చొచ్చుకెళ్లాలని భావించింది. కానీ తాను ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని రజనీ తేల్చేయడంతో.. బీజేపీ వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఇక ఇప్పుడు తెలుగు జనాన్ని ప్రభావితం చేయడానికి 'ప్రభాస్' పేరును బీజేపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.

పవన్ కలిసిరాకపోయినా!:
గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతునిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన.. పవన్ తమ పార్టీతో కలిసిరాకపోయినా.. ప్రభాస్‌ను వెంటపెట్టుకుని బీజేపీ పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తమ పార్టీ నాయకుడే కాబట్టి.. ఇదేమంత కష్టం కాదని బీజేపీ శ్రేణులు భావించవచ్చు.

షూటింగ్ షెడ్యూల్స్‌కు ఇబ్బంది కలగకుండా!:
ప్రభాస్ షూటింగ్స్ కు ఇబ్బంది కలగకుండా ఎన్నికల షెడ్యూల్ ను రూపొందించాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనంలో ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ ను పూర్తిగా వినియోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ఆ పార్టీ ప్లాన్.
కాగా, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వాజ్ పేయి హయాంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కూడా పనిచేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి... తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications