వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఏటీఎం నుంచి బంగారు బిస్కెట్లూ పొందొచ్చు!(వీడియో)

దుబాయ్ అంటేనే ఆకాశ హర్మ్యాలు, ఖరీదైన వాహనాలతో ఎంతో విలాసవంతమైన దేశమనే విషయం గుర్తుకు వస్తోంది. ఆ దేశం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈ దేశం చాలా ముందుంటుంది. ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దు

|
Google Oneindia TeluguNews

అబూదాబి: దుబాయ్ అంటేనే ఆకాశ హర్మ్యాలు, ఖరీదైన వాహనాలతో ఎంతో విలాసవంతమైన దేశమనే విషయం గుర్తుకు వస్తోంది. ఆ దేశం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈ దేశం చాలా ముందుంటుంది. ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దుబాయ్ ఆ స్థాయిలోనే సదుపాయాలను కల్పించుకుంటోంది.

కాగా, దుబాయిలో బంగారం బిస్కెట్లు, కడ్డీలను ఏటిఎమ్‌ల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకు తగిన మొత్తం ఆ మిషన్‌లో పెడితే సరిపోతుంది. నేరుగా బంగారం బిళ్లలు లేదా బిస్కట్లు ఆ మొత్తానికి సరిపడా వస్తాయి. ఇతర విషయాల్లోకి వెళితే.. దుబాయిలో నేరాలకు చోటు చాలా తక్కువ.ఎందుకంటే అక్కడి చట్టాలు అంత కఠినంగా అమలవుతాయి కాబట్టి.

అంతేగాక, దుబాయి పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. నేరస్తుల్ని వెంటాడి పట్టుకోవటం కోసం ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే కార్లను ఉపయోగిస్తోంది. గంటకు 253 మైళ్ల వేగంతో నడిచే 'బుగాటి వేరాన్‌' కార్లను అక్కడి పోలీసులు వాడతారు. ఈ కారు 2.5 సెకండ్లలో 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. అత్యంత వేగంగా నడిచే పోలీస్‌ కారుగా ఇది గిన్నిస్‌ బుక్‌లోకి కూడా ఎక్కేసింది.

భవంతులు, ఇళ్లు, ఆఫీసులు, షాపింగ్‌ మాల్స్‌...ఇలా ఒకటేమిటి? దుబాయి అంతటా ఏసీనే! ఆఖరుకు ప్రజల సౌకర్యార్ధం బస్‌లతోపాటు, బస్‌ స్టాప్‌లను కూడా ఏసీలను ఏర్పాటు చేయడం విశేషం. దుబాయి బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. 2013 ఒక్క సంవత్సరంలోనే ప్రపంచం మొత్తం బంగారంలో 40 శాతం దుబాయిలోనే ట్రేడ్‌ అయింది. ఈ బంగారం మొత్తం 354 ఏనుగులకు మించిన బరువుంది.

బుర్జ్‌ ఖలీఫా ఎంత ఎత్తు ఉంటుందంటే దాన్లో ఉండే కొన్ని కుటుంబాలు నమాజ్‌ ఉపవాసాన్ని విరమించటం కోసం మిగతా ఫ్లోర్లలో వాళ్లకంటే ఇంకొంత ఎక్కువ సమయం ఆగాల్సి ఉంటుందట. ఎందుకంటే 80 నుంచి ఆ పై అంతస్తుల్లో ఉండే వాళ్లకు ఆలస్యంగా పొద్దు కుంగుతుంది. కాగా, దాబాయి ఎకానమీలో ఇంధనం వాటా కేవలం 6 శాతమే అయినా.. ప్రాంతీయంగా ఎకానమీ మొత్తం రియల్‌ ఎస్టేట్‌, టూరిజం నుంచే సమకూరుతుంది.

English summary
Only in the United Arab Emirates will you find a vending machine where you can purchase gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X