నా భర్తకు మంచి భార్య కావాలి: హృదయాలను కదిలిస్తున్న ఆమె లేఖ
ఇలాంటి కథతో చాలానే సినిమాలు వచ్చాయి... కానీ, ఇది నిజ జీవితం జరిగితే చాలా బాధగానే ఉంటుంది. తన ప్రాణం పోతుందని తెలిసిన ఓ మహిళ.. తన భర్త తదుపరి జీవితం సాఫీగా ఉండాలని కోరుకుంది.
న్యూయార్క్: ఇలాంటి కథతో చాలానే సినిమాలు వచ్చాయి... కానీ, ఇది నిజ జీవితం జరిగితే చాలా బాధగానే ఉంటుంది. తన ప్రాణం పోతుందని తెలిసిన ఓ మహిళ.. తన భర్త తదుపరి జీవితం సాఫీగా ఉండాలని కోరుకుంది. అంతేగాక, అతనికి ఓ మంచి భార్యను చూసే బాధ్యతను కూడా తనపైనే వేసుకుంది. తన భర్తకు ఓ మంచి భార్య కావాలంటూ వేట కొనసాగించింది.
ప్రముఖ పిల్లల కథల రచయిత్రి ఆమీ క్రూజ్ రోసెంతాల్‌కు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తాను చనిపోయే ముందు తన భర్తకు మరో మంచి భాగస్వామిని తానే వెతికి పెట్టాలనుకుంటున్నది ఆమీ క్రూజ్. అందుకే 'యూ మె వాంట్ టు మ్యారీ మై హజ్బెండ్' పేరుతో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ కథనం కూడా రాసిందామె. అందులో తన భర్త ఎంత మంచివాడో.. అతనిని పెళ్లి చేసుకోవడం ఎవరికైనా ఎంత అదృష్టమో వివరించింది.

ఇది చదివిన ప్రతి ఒక్కరూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా తన భర్తతో కలిసి ఉంటున్నానని, మరో 26 ఏళ్లు కూడా కలిసి ఉండాలని ఉన్నా.. తనకు ఆ అవకాశం లేదని ఆమె తన కథనంలో రాసింది. ఐదు అడుగుల పది అంగుళాలు ఉండే తన భర్త జేసన్ ఓ లాయర్ అని, వంట చేయడం, లైవ్ మ్యూజిక్ వినడాన్ని ఎంజాయ్ చేస్తాడని ఆమె పేర్కొంది.
ఓ కలల రాకుమారుడి కోసం మీరు ఎదురు చూస్తుంటే.. జేసన్ మీకు తగిన వ్యక్తి అవుతాడని ఆమీ క్రూజ్ పేర్కొనడం గమనార్హం. అతనికి తగిన అమ్మాయి దొరికాలని, మరో లవ్‌స్టోరీ మొదలు కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆమీ రాసుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఆమె లేఖ నెట్‌లో వైరల్‌గా మారి అనేక హృదయాలను కదిలిస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications