పయ్యావులతో కేసీఆర్ ఏం మాట్లాడారు, అంతకుమించి లేదా?: టిడిపిలో హాట్ టాపిక్
మంత్రి పరిటాల సునీత నయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, టిడిపి నేత పయ్యావుల కేశవ్‌లు ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్న విషయం తెలిసిందే.
అనంతపురం: మంత్రి పరిటాల సునీత నయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, టిడిపి నేత పయ్యావుల కేశవ్‌లు ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

టిడిపిలో హాట్ టాపిక్‌గా కెసిఆర్ - పయ్యావుల ముచ్చట్లు
ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇది టిడిపిలో హాట్ టాపిక్ అయిందని తెలుస్తోంది. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం కేసీఆర్ హెలిప్యాడ్‌కు బయల్దేరారు. ఇంతలో పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు.

పయ్యావులను పిలిచిన కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి
కేసీఆర్‌కు పయ్యావుల నమస్కారం చేశారు. ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్ హెలికాప్టర్ వద్దకు కదిలారు. అంతలో కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పయ్యావుల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ పిలుస్తున్నట్టు తెలిపారు. దీంతో పయ్యావుల... కేసీఆర్ వద్దకు వెళ్లారు. వారిద్దరూ ప్రత్యేకంగా కాసేపు మాట్లాడుకున్నారు.

వ్యక్తిగత సిబ్బందిని కూడా రానివ్వలేదు
ఆ సమయంలో సీఎం వ్యక్తిగత సిబ్బందిని కూడా అక్కడికి రానివ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకున్నారా? అని సర్వత్రా చర్చ సాగుతోంది.

ఏకాంత ముచ్చట్లకు ఇదే కారణమా?
కెసిఆర్ టిడిపిలో ఉండగా అనంతపురం ఇంచార్జ్ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్ కూడా పని చేశారు. ఆ సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యంతోనే నేడు వారు మాట్లాడుకున్నారని కొందరు చెబుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications