అజర్.. ఇక్కడి నుంచి పోటీకి దిగు: కాంగ్రెస్ సూచన, సిద్దమేనంటూ బదులు..
రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్లామర్ అద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఉంది.మజ్లిస్ పార్టీ అధినేత, ప్రస్తుత ఎంపీ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్లామర్ అద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఉంది.
మజ్లిస్ పార్టీ అధినేత, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి దిగాలని కాంగ్రెస్ నేతలు అజహరుద్దీన్ కు సూచిస్తున్నారు. గురువారం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద సద్భావన అవార్డు అజహరుద్దీన్ కు ప్రధానం చేసిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.

కాంగ్రెస్ నేతల సూచన:
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడారు. అజహరుద్దీన్ హైదరాబాదీ కావడంతో ఇక్కడి సమస్యల పట్ల అవగాహన ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు.

యూపీ నుంచి
అజహరుద్దీన్ గత 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ నేతలు పట్టుబడుతుండటంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

అవార్డు పట్ల సంతోషం:
రాజీవ్ సద్భావన అవార్డు నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఈ వయసులో కూడా గోపాలకృష్ణ గారు చాల జోష్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే జోష్ కాంగ్రెస్ పార్టీలో కూడా రావాలన్నారు.

సూచనపై సానుకూలంగా:
హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు చేసిన సూచన పట్ల అజహరుద్దీన్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి పని చేస్తానన్నారు. పార్టీకి నాసేవలు కావాలంటే నేను సిద్ధంగా ఉన్నానన్నారు.
అందరు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. కాబట్టి రానున్న ఎన్నికలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అందరు కలిసి పని చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications