గదిలో ఉంచి వంతులవారీగా, అమ్మాయి అందంగా ఉంటేనే: వయాగ్రాతో షేక్‍ల దారుణం
పాతబస్తీ కాంట్రాక్ట్ పెళ్లిళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముసలి అరబ్ షేక్‌లు హోటల్లో బాలికలను ప్రశ్నించి, అందులో తమకు నచ్చిన వారిని ఓకే చేసుకుంటారు.
Recommended Video

హైదరాబాద్: పాతబస్తీ కాంట్రాక్ట్ పెళ్లిళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా కొంతమంది అమ్మాయిలను అరబ్ షేక్‌లు తమ హోటల్ గదికి రప్పించుకుంటారు. ఆ హోటల్ గదిలోనే అమ్మాయిలందరిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
అందులో తమకు నచ్చిన వారిని సెలక్ట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేసి, పలువురు అరబ్ షేక్‌లు, మధ్యవర్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అందం, ఆరోగ్యం ఉంటే చాలు
అందం, ఆరోగ్యం ఉంటే చాలు, అలాంటి బాలికలకు పెద్ద మొత్తంలో డబ్బులు కుమ్మరించి సొంతం చేసుకునేందుకు అరబ్ షేక్‌లు పోటీపడుతున్నారు. పెళ్లి పేరిట యువతులను నమ్మించి ఎడారి దేశంలో వారికి నరకం చూపుతున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను సొంతం చేసుకుంటున్నారు.

వేలంపాట వలె అమ్మాయిల అందానికి వెల
వేలంపాటను మరిపించేలా షేక్‌లు అమ్మాయిల అందానికి వెలకడతారు. చూపుపడిన అమ్మాయిని దక్కించుకునేందుకు ఎంతైనా డబ్బులు చెల్లించేందుకు ముందుకు వస్తారు.

మరో ఆసక్తికర విషయం
అమ్మాయిలను కొనేందుకు ధనవంత అరబ్ షేక్‌లే కాదు, కూలీ పని చేసుకునే ముసలివాళ్లు కూడా వస్తారు. చేతికి వచ్చే లక్షలాది రూపాయలతో కొందరు ఇంటి పని, శారీరక అవసరాలు తీర్చుకునేందుకు కాంట్రాక్టు పెళ్లి కోసం వెంపర్లాడుతున్నారు. ఖతార్, ఒమన్‌లో ఉండే వారే అధికశాతం పాతబస్తీ అమ్మాయిలంటే ఆసక్తి చూపుతుంటారు.

ఒక్కొక్కరు పదిపదిహేను మందిని పరిశీలిస్తారు
పెద్ద కుటుంబాలు, పేదరికం, నిరక్షరాస్యతను అవకాశంగా చేసుకుని దళారులను రంగంలోకి దింపుతారు. అక్కడి నుంచి ఒకేసారి 5-10 మంది షేక్‌లు హైదరాబాద్ వస్తారు. లాడ్జీలు, స్టార్ హోటల్స్ స్థాయినిబట్టి బస చేస్తారు. ఒక్కొక్కరు కనీసం 10-20 మంది అమ్మాయిలను పరీక్షిస్తారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొందరైతే వైద్యులతో కన్యత్వ పరీక్షలు కూడా చేయిస్తారనే షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది.

లైంగిక పటుత్వం కోసం వయగ్రా
పెళ్లికి రెండు రోజుల ముందు వృద్ధ షేక్‌లు కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటారు. లైంగిక పటుత్వం కోసం వయాగ్రా, స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అందం, ఆరోగ్యం, రెండూ ఉన్న అమ్మాయి కంటపడితే ఎట్టిపరిస్థితుల్లోనూ వదలరు. ఎంతరేటైనా ఇచ్చేందుకు సిద్ధపడతారు. షేక్‌లు ఇచ్చే సొమ్మును దళారులు, ఏజెంట్లు, తల్లిదండ్రులు పంచుకుంటారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications