శశికళ దేశం కోసం పోరాడి వచ్చారా, అందరూ నేరస్తులే: డిజిపి
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన కర్నాటక డిజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ విషయంలో మీడియా అధికార ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన కర్నాటక డిజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ విషయంలో మీడియా అధికార ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శశికళకు అంత ప్రాధాన్యత ఇవ్వడంపై కర్ణాటక డీజీపీ సత్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళ ఏమైనా దేశంకోసం పోరాటం చేసి జైలుకొచ్చారా? అని అన్నారు. మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రశ్నించారు.
అంతేకాకుండా, పరప్పణ అగ్రహార జైలులో ఏ, బీ అనే తరగతి జైలు గదులు లేవన్నారు. అన్ని గదులు ఒకేలా ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఉన్న ఇతర ఖైదీల తరహాలోనే శశికళ కూడా ఉన్నారన్నారు. జైలుకొచ్చే ప్రతి ఒక్కరూ నేరస్థులేనన్నారు.












Click it and Unblock the Notifications