పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొంటే కఠిన శిక్ష, ఎక్కడ, ఎందుకు?

పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే ఇక శిక్షలు విధిస్తామని దుబాయ్ హెచ్చరించింది. ఇతర దేశాల నుండి ఉపాధి కోసం వలసవెళ్ళే వారు దుబాయ్ లో పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొంటే శిక్షిస్తామని దుబాయ్ ప్రభుత్వం హ

దుబాయ్: పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే ఇక శిక్షలు విధిస్తామని దుబాయ్ హెచ్చరించింది. ఇతర దేశాల నుండి ఉపాధి కోసం వలసవెళ్ళే వారు దుబాయ్ లో పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొంటే శిక్షిస్తామని దుబాయ్ ప్రభుత్వం హెచ్చరించింది.

ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్ళే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. గల్ప్ వెళ్ళిన వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన ఉండదు.

 Filipino couple appeals ‘premarital sex’ sentence in Dubai

దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిలిఫ్పైన్స్ నుండి యూఏఈ వెళ్ళిన వారు ఇటీవల కష్టాలను ఎదుర్కొంటున్నారు.

కొందరు ఫిలిఫ్పైన్లు పెళ్ళవ్వకుండానే ఆడ, మగ కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు. అంతేకాదు లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. గర్భం దాల్చడంతో పిల్లల్ని కూడ కంటున్నారు.

ఈ విషయమై యూఏఈ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిలిఫైన్స్ లో పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొనడం చట్టబద్దమే. కానీ, యూఏఈలో మాత్రం ఈ విషయాన్ని నేరంగా పరిగణిస్తారు.

యూఏఈలో పనిచేస్తున్న పలువురు ఫిలిఫైన్స్ వాసులు పెళ్ళి కాకుండానే సెక్స్ లో పాల్గొన్నారు. పిల్లల్ని కూడ కన్నారు. దీంతో విషయం పోలీసులకు తెలిసింది.

నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం దేశం నుండి బహిష్కరించారు. ఈ తీర్పుతో యూఏఈ అధికారులకు ఫిలిఫైన్లకు హెచ్చరికలు జారీ చేశారు. పెళ్ళికి ముందుకు సెక్స్ లో పాల్గొంటే ఊరుకోబోమన్నారు.

Recommended Video

    చట్టాలను అమలు చేసి తీరుతామన్నారు. ఒక్క ఫిలిఫైన్స్ పౌరులే కాకుండా మిగతా దేశాల వారు కూడ ఈ విషయాన్ని గమనించాలని యూఏఈ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+