నంద్యాలపై జగన్: వైసిపి నాయకులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసిన లగడపాటి

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ నష్టం జరగకుండా చేశారా? అంటే అవుననే అంటున్నారు.

Recommended Video

    Lagadapati Rajagopal saved a whopping Rs 50 Cr of YSRCP వైసిపి కి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా| Oneindia

    అమరావతి: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ నష్టం జరగకుండా చేశారా? అంటే అవుననే అంటున్నారు.

    టిడిపి అద్భుత విజయం

    టిడిపి అద్భుత విజయం

    ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి, వైసిపి మధ్య పోటీ రసవత్తరంగా కనిపించింది. ఈ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి అద్భుత విజయం సాధించారు. టిడిపి 27వేలకు పైగా మెజార్టీతో గెలిచింది.

    జగన్ గెలుపు ధైర్యం

    జగన్ గెలుపు ధైర్యం

    నంద్యాల ఉప ఎన్నికల కోసం వైయస్ జగన్ ఏకంగా 13 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. జగన్ మకాం, శిల్పా సోదరులకు ఉన్న పట్టు కారణంగా వైసిపి కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ వారు భావించారు. జగన్ కూడా టిడిపి, బాబులపై నిప్పులు చెరుగుతూ.. శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పారు.

    పెద్ద ఎత్తున బెట్టింగు

    పెద్ద ఎత్తున బెట్టింగు

    వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అంతర్గత భేటీల్లోను గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలపై జోరుగా బెట్టింగులు సాగిన విషయం తెలిసిందే. జగన్ ధీమా కారణంగా చాలామంది వైసిపి నాయకులు శిల్పా మోహన్ రెడ్డి గెలుపుపై పెద్ద మొత్తంలో బెట్లు కాశారని చెబుతున్నారు.

    లగడపాటి జోస్యంతో రివర్స్

    లగడపాటి జోస్యంతో రివర్స్

    అయితే, మరికొంత మంది వైసిపి నాయకులు శిల్పా మోహన్ రెడ్డి పైన బెట్టు కాసేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే టిడిపి గెలుస్తుందన్న లగడపాటి రాజగోపాల్ జోస్యం వారిని పునరాలోచించేలా చేసిందని అంటున్నారు.

    పెద్ద మొత్తంలో ఆదా చేశారు

    పెద్ద మొత్తంలో ఆదా చేశారు

    గతంలో లగడపాటి సర్వేలు ఎక్కువ వరకు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో మరికొంతమంది శిల్పాపై బెట్టుకట్టేందుకు వెనుకాడరని అంటున్నారు. దీంతో జగన్ టీంకు అంటే వైసిపి నాయకులకు దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు లగడపాటి ఆదా చేశారనే ప్రచారం చక్కెర్లు కొడుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+