నేనంటే నేను: రచ్చకెక్కిన ట్రంప్ ముగ్గురు భార్యలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముగ్గురు భార్యలు రచ్చకెక్కారు. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ ఇప్పటికే తన గొంతుకను పుస్తకం రూపంలో వినిపించారు. దీనిపై దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

తాజాగా ఆమెకు ఇప్పుడు ట్రంప్ మరో భార్య తోడయ్యారు. ట్రంప్‌ ప్రస్తుత భార్య(మూడో భార్య) మెలానియా ట్రంప్‌ బరిలోకి దిగారు. ఇవానా ట్రంప్‌ను, ఆమె తర్వాత వచ్చిన మార్లా మ్యాపిల్స్‌ను పరోక్షంగా దుయ్యబట్టారు.

ట్రంప్ పై పుస్తకం

ట్రంప్ పై పుస్తకం

'రైజింగ్‌ ట్రంప్‌' పేరుతో ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలోని ప్రమోషన్‌లో భాగంగా సోమవారం 'గుడ్‌ మార్నింగ్‌ అమెరికా' అనే కార్యక్రమంలో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

అమెరికా ప్రథమ పౌరురాలిని నేనే...

అమెరికా ప్రథమ పౌరురాలిని నేనే...

ఈ సందర్భంగా 'నేను ట్రంప్‌కు మొదటి భార్యను. అమెరికా ప్రథమ పౌరురాలిని కూడా నేనే' అని ఇవానా ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆమె మరికొన్ని ప్రైవేట్‌ విషయాలు కూడా వెల్లడించారు. వారిద్దరికి కలిగిన ముగ్గురు సంతానం పెంపకం గురించి తెలిపారు.

చేయాలనుకుంటే నేనెన్నో చేయగలను, కానీ...

చేయాలనుకుంటే నేనెన్నో చేయగలను, కానీ...

అంతేకాదు, తనకు శ్వేత సౌదానికి వెళ్లేందుకు నేరుగా మార్గం ఉందని, తన మాజీ భర్త ట్రంప్ ను ఎప్పుడంటే అప్పుడు తాను కలుసుకోగలనని కూడా ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ పేర్కొన్నారు. టెలిప్రమోటర్‌ లేకుండానే 45 నిమిషాలపాటు ప్రసంగం చేయగలనని, చర్చలు జరపగలనని, ఎంటర్‌టైన్‌ చేయగలనని.. ఇలా ఎన్నో చేసే అవకాశం తనకు ఉందని ఆమె చెప్పారు.

 నాకు స్వేచ్ఛగా ఉండడమే ఇష్టం...

నాకు స్వేచ్ఛగా ఉండడమే ఇష్టం...

తనకు స్వేచ్ఛగా ఉండడం ఇష్టమని ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో బందీగా బతకలేనని చెప్పారు. అంతటితో ఊరుకోకుండా ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియాను ఆమె ఎద్దేవా చేశారు. మెలానియా వాషింగ్టన్‌లో ఉండేందుకు తెగ భయపడుతోందని వ్యాఖ్యానించారు.

మెలానియా ట్రంప్ తరుపున ప్రకటన...

మెలానియా ట్రంప్ తరుపున ప్రకటన...

డొనాల్డ్ ట్రంప్ మొదటిభార్య ఇవానా ట్రంప్ వ్యాఖ్యలతో ఆయన ప్రస్తుత భార్య (మూడోభార్య) మెలానియా ట్రంప్‌ రంగంలోకి దిగారు. శ్వేతసౌధానికి చెందిన అధికారిక ప్రతినిధి ఒకరు మెలానియా తరుపున ఓ ప్రకటన చేశారు.

చిన్నారులకు సేవ చేస్తున్నా.. పుస్తకాలమ్ముకోవడం లేదు

చిన్నారులకు సేవ చేస్తున్నా.. పుస్తకాలమ్ముకోవడం లేదు

'వాషింగ్టన్‌లో ఉండేందుకు మెలానియా ఏమాత్రం భయపడడం లేదు. పైగా శ్వేతసౌధంలో ఉండడం మెలానియాకు ఎంతో ఇష్టం. అమెరికా ప్రథమ పౌరురాలిగా తనకు దక్కిన పాత్రను మెలానియా ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ఆమె ప్రస్తుతం చిన్నారులకు సహాయం చేసే పనుల్లో ఉన్నారు.. పుస్తకాలు అమ్ముకునే విషయంలో కాదు..' అంటూ ఈ ప్రకటన ద్వారా ట్రంప్ మొదటిభార్య ఇవానా ట్రంప్ కు చురక అంటించారు మెలానియా.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Things are getting a little "Real Housewives" around the White House. In one of the stranger sideshows to his presidency, President Donald Trump's first and third wives, Ivana and Melania, respectively, on Monday had a very public war of words - and his second wife, Marla Maples, is getting some shade out of the spat, to boot. Here's a breakdown: To promote her new book, "Raising Trump," about parenting Trump's three eldest children, Ivana Trump gave a Monday interview to "Good Morning America" in which she made some comments sure to privately raise the hackles of the woman occupying the role of Wife of Donald. "I'm basically first Trump wife. OK?" Ivana Trump said. "I'm first lady." She offered faux sympathy for Melania Trump, saying "I think for her to be in Washington must be terrible."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి