పవన్ కల్యాణ్ పార్టీలోకి జ్వాలా గుత్తా: నితిన్ కాళ్లు పట్టుకోలేదని...
జ్వాలా గుత్తా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఆమె పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
హైదరాబాద్: రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఆలోచిస్తున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ప్రచారం ఇటీవలి దాకా సాగింది.
అయితే, తాజాగా మారో మాట వినిపిస్తోంది. ఆమె జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో జత కట్టే అవకాశం ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని ఆ ప్రచారానికి తెర తీశారు. ఆమె జనసేన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ రాజకీయాలపై గుత్తా జ్వాల మాట్లాడారు. తనకు పవన్ ప్రసంగాలు నచ్చుతాయని ఆమె చెప్పారు. ఆయన ప్రజా సమస్యలు, వ్యవసాయం, విద్యా వ్యవస్థ వంటి సామాజిక అంశాల గురించి ఎక్కువగా మట్లాడతారని చెప్పారు.

పవన్ కల్యాణ్ విజన్ బాగుంటుందని...
పవన్ కల్యామఅ విజన్ చాలా బాగుంటుందని జ్వాలా గుత్తా చెప్పారు. తాను 2019 ఎన్నికల్లో ఒక స్టార్ క్యాంపెయినర్‌గా కచ్చితంగా ఉండనని చెప్పారు. అయితే తప్పకుండా ఏదొకటి చేయాలని మాత్రం ఉన్నట్టు తన అభిప్రాయాన్ని చెప్పారు. దీంతో ఆమె పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనే పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

ఏ పార్టీలో చేరుతారంటే...
ఏ పార్టీలో తాను చేరతారనే విషయంపై ఆమె స్పందించరాు. తనను తనలానే ఉండనిచ్చే పార్టీలో ఉండేందుకు ఇష్టపడతానని జ్వాలా గుత్తా చెప్పారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని అంటున్నారు. ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, ఎంపి కల్వకుంట్ల కవితతో సన్నిహితంగా ఉంటున్నారని, దానివల్ల ఆమె తెరాసలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది.

హీరో నితిన్ కాళ్లు పట్టుకున్నారని పుకార్లు...
నితిన్ హీరోగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో జ్వాలా గుత్తా నృత్యం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటలో గుత్తా జ్వాల నటించేందుకు నితిన్ ఆమె కాళ్లుపట్టుకున్నాడనే పుకారుపై ఆమె స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.

నితిన్ అలా చేయలేదు..
హీరో నితిన్ కాళ్లు పట్టుకోవడం లాంటిది ఏమీ లేదని జ్వాలా గుత్తా స్పష్టం చేశారు. అయితే ఆ పాట తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందని ఆమె అన్నారు. అది ఐటెమ్ సాంగ్ కాదని, స్పెషల్ సాంగ్ అని చెప్పారు. అందులో తన పేరు కూడా ఉందని ఆమె చెప్పారు.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications